Viral Video: గుంతలో పడిన గున్న ఏనుగును రక్షించారు.. అది చేసిన పని మీ మనసును తాకుతుంది

ఏనుగులు ఎంత అమాయకమైనవో, హృదయానికి హత్తుకునేలా ప్రవర్తిస్తాయో చెప్పే ఒక కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మట్టి గుంటలో చిక్కుకున్న ఓ చిన్న ఏనుగు పిల్లను రక్షించిన అనంతరం అది ధన్యవాదాలు తెలిపిన వీడియో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

Viral Video: గుంతలో పడిన గున్న ఏనుగును రక్షించారు.. అది చేసిన పని మీ మనసును తాకుతుంది
Elephant Rescue

Updated on: Jun 05, 2025 | 3:05 PM

ఏనుగులు సున్నితమైన జీవులుగా ప్రసిద్ధి చెందాయి. అవి కోపం, ఆనందం, కరుణ, దుఃఖం వంటి భావోద్వేగాలను మనుషుల మాదిరిగానే ప్రదర్శిస్తూ ఉంటాయి.
అంత భారీ కాయం ఉన్నప్పటికీ అవి అమాయకంగా కనిపిస్తూ.. హృదయానికి హత్తుకునే పనులు చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ గున్న ఏనుగు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మట్టి గుంటలో చిక్కుకున్న ఓ ఏనుగు పిల్లను రక్షించిన వీడియో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే.. రాయ్‌గఢ్ జిల్లా లైలుంగ-ఘర్గోడా ఫారెస్ట్ ఏరియాలో ఏనుగుల గుంపు నీటిలో జలకాలాటలు ఆడుతూ ఉండగా… ఆ గుంపులోని చిన్న ఏనుగు అనుకోకుండా ఒక లోతైన మట్టిగుంటలో పడిపోయింది. అది పైకి రావడానికి ఎంత ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. దాంతో ఆ ఏనుగు పిల్ల చేసిన అరుపులు అడవంతా మారుమోగాయి. గ్రామస్థులు దాని బాధను అర్థం చేసుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు.. జేసీబీ సాయంతో గుంత చుట్టూరా మట్టిన తవ్వి.. ఏనుగు సులభంగా బయటకు రావడానికి మార్గం ఏర్పాటు చేశారు.

రెస్క్యూ తర్వాత జరిగిన సంఘటనే అసలు హైలైట్. గుంత పైకి ఎక్కుతూ ఆ పిల్ల ఏనుగు తన తొండంతో జేసీబీ యంత్రాన్ని మెల్లగా తాకి ధన్యవాదాలు చెప్పడం కనిపించింది. ఆ భావోద్వేగ దృశ్యం అక్కడ ఉన్న అందరి హృదయాలను హత్తుకుంది.

ఈ వీడియోను ఏఎన్ఐ అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. “ఘర్గోడా అడవుల్లో మట్టి గుంతలో చిక్కుకుపోయిన ఏనుగు పిల్లను రక్షించగా, అది తన తొండంతో ఇలా ధన్యవాదాలు తెలిపింది,” అని రాశారు. నెటిజన్లు ఈ వీడియోకు ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు. వన్యప్రాణులు మనుషుల కంటే మెరుగైన కృతజ్ఞత చూపిస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు.

వీడియో దిగునవ చూడండి.. 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..