Viral Video: నెక్ట్స్ లెవెల్ రిపోర్టింగ్ అంటే ఇదే మరి.. గేదెతో ముఖాముఖీ.. చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు..

|

Jul 23, 2021 | 10:08 AM

Viral Video: కాలం మారుతుంది.. కాలంతో పాటు ప్రజలూ మారుతున్నారు. వారి అలవాట్లు, నడవడికలూ, అభిరుచులూ మారుతున్నాయి.

Viral Video: నెక్ట్స్ లెవెల్ రిపోర్టింగ్ అంటే ఇదే మరి.. గేదెతో ముఖాముఖీ.. చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు..
Reporting
Follow us on

Viral Video: కాలం మారుతుంది.. కాలంతో పాటు ప్రజలూ మారుతున్నారు. వారి అలవాట్లు, నడవడికలూ, అభిరుచులూ మారుతున్నాయి. అయితే, ఒక వ్యాపార సామ్రాజ్యంలో రాణించాలంటే ప్రజలను మెస్మరైజ్ చేయాలి. వారిని ఆకట్టుకోగలగాలి. వారికి అవసరమైన వాటిని గుర్తించి వాటిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఇక ముఖ్యంగా చెప్పాలి మీడియా రంగంలో రోజు రోజు వినూత్న పోకడలు వస్తున్నాయి. పోటీతత్వం పెరగడంతో.. ప్రజలను తమవైపు లాక్కునేందుకు రకరకాల ప్రయత్నాలు, ఫీట్లు చేస్తున్నారు. కొత్త కొత్త విధానాలతో రిపోర్టింగ్ అందించడం.. వింత సమాచారాలను ప్రజలకు చేర్చడం వంటివి చేస్తున్నారు.

తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఒక రిపోర్టర్ గేదెను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆ గేదెను పలు ప్రశ్నలు కూడా అడిగేశాడు. మరి ఆ గేదె కూడా విచిత్రంగా సమాధానం చెప్పేసింది. ఈ విచిత్ర రిపోర్టింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. పాకిస్తాన్‌ జర్నలిస్ట్ అమిన్ హఫీజ్ లాహోర్‌లోని ఒక గేదెను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ‘లాహోర్‌లో ఉండటం మీకు ఎలా అనిపిస్తుంది?’ అని గేదెను అడగ్గా.. అది ఒక్క సారిగా అరిచింది. ఆ అరుపునే సమాధానంగా భావించిన అతను.. గేదెకు లాహోర్ నచ్చిందంటూ రిపోర్ట్ ఇచ్చేశాడు. అంతేకాదు.. ‘లాహోర్‌లో ఆహారం బాగుందా? లేక మీ గ్రామంలోని ఆహారం బాగుందా?’ అని మరో ప్రశ్న అడగ్గా.. గేదె మళ్లీ అరిచింది. దీనికి కూడా తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు ఆ రిపోర్టర్. లాహోర్‌లోని ఆహారమే బాగుందని గేదె సమాధానం చెప్పినట్టు తేల్చేశాడు. ఈ రిపోర్టింగ్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇది చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఈ ఇంటర్వ్యూపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.