Viral Video: రెండు తలలు, మూడు కండ్లతో జన్మించిన దూడ.. క్యూ కట్టి పూజలు చేస్తున్న జనం..!

ఇలాంటి రెండు తలలతో పుట్టిన ఆవు, లేద దూడను పాలీసెఫాలీ అని పిలుస్తారని పశువైద్యులు చెప్పారు. తల్లి గర్భంలోని పిండం అసంపూర్ణంగా విడిపోవడం లేదా రెండు పిండాల కలయిక కారణంగా ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయని వారు అన్నారు. చాలా అరుదుగా రెండు తలలతో పుట్టే దూడలు స్వల్ప కాలం మాత్రమే జీవించే అవకాశమున్నదని కూడా వారు స్పష్టం చేశారు. అయితే, ఈ దూడ

Viral Video: రెండు తలలు, మూడు కండ్లతో జన్మించిన దూడ.. క్యూ కట్టి పూజలు చేస్తున్న జనం..!
Calf Born With 2 Heads

Updated on: Jun 23, 2025 | 12:24 PM

ఒక విచిత్రమైన, అరుదైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక ఆవు రెండు తలలు, మూడు కళ్ళు ఉన్న దూడకు జన్మనిచ్చింది. బాగ్‌పత్‌ తిక్రి గ్రామంలో జరిగిన ఈ వింతను చూసేందుకు స్థానికులతో పాటుగా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా బారులు తీరారు. దీనిని ఒక అద్భుతం అని భావించిన స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చారు. కొందరు ఆ ఆవు దూడకు పూజలు చేయటం మొదలుపెట్టారు. అయితే, ఈ అరుదైన ఆవు దూడకు రెండు ముక్కులు, మూడు కళ్ళు, రెండు చెవులు పూర్తిగా స్పష్టంగా ఉన్నాయి.

ఇలాంటి అరుదైన వింత ఆవు దూడను చూసిన గ్రామస్తులు చేతులు జోడించి ప్రార్థన చేస్తూ, ఆ ఆవు ముందు వంగి నమస్కరిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దూడ తలను దాని యజమానికి తన చేతుల సాయంతో ఎత్తి చూపిస్తున్నాడు. ఆ దూడ తనంతట తానుగా లేవలేక పోవడం వల్ల అది ఎదుర్కొంటున్న ఆరోగ్య ప్రమాదాలు, అనారోగ్యాలను సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఇలాంటి రెండు తలలతో పుట్టిన ఆవు, లేద దూడను పాలీసెఫాలీ అని పిలుస్తారని పశువైద్యులు చెప్పారు. తల్లి గర్భంలోని పిండం అసంపూర్ణంగా విడిపోవడం లేదా రెండు పిండాల కలయిక కారణంగా ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయని వారు అన్నారు. చాలా అరుదుగా రెండు తలలతో పుట్టే దూడలు స్వల్ప కాలం మాత్రమే జీవించే అవకాశమున్నదని కూడా వారు స్పష్టం చేశారు. అయితే, ఈ దూడ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మాత్రం తెలియదు. కానీ, వీడియో మాత్రం నెట్టింట అవుతూనే ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..