Watch: కదులుతున్న రైలు దిగబోయి కింద పడిపోయిన వ్యక్తి.. షాకింగ్ వీడియో

కెఆర్ పురం రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుండి మంగళూరు వెళ్తున్న రైలు వేగంగా వెళుతోంది. ఇంతలో, ఒక ప్రయాణికుడు రైల్లోంచి ప్లాట్‌ఫారమ్‌ మీదకు వేలాడుతున్నాడు. అతడు పట్టాలపై పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు..అతను రైలు కింద పడబోతున్న సమయంలో అక్కడే ఉన్న మాజీ సైనికుడు సతీష్, రైల్వే సిబ్బంది ప్రదీప్ కుమార్ అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు.

Watch: కదులుతున్న రైలు దిగబోయి కింద పడిపోయిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Man from Falling Under Train

Updated on: Jun 24, 2025 | 1:11 PM

కదులుతున్న రైలు దిగబోయిన ఓ వ్యక్తి పట్టు తప్పి పడిపోయాడు. ఓ వైపు రైలు అలా కదులుతూ ఉండగానే.. అతడు పట్టాలకు, ప్లాట్ ఫామ్ కు మధ్యలో పడబోయాడు..తృటిలో అతడు ఆ రైలు కిందపడి అత్యంత దారుణంగా చనిపోయే ప్రమాదం ఉండేది. కానీ ఆ వ్యక్తిని గమనించిన రైల్వే సిబ్బంది వేగంగా పరుగెత్తుకుని అతన్ని కాపాడారు. కదులుతున్న రైలు బోగీలు, ప్లాట్‌ఫామ్‌ తగలకుండా ఆ ప్రయాణికుడిని ప్లాట్ ఫామ్ మీదకు లాగేశారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదంతా స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డైంది. మరింత పూర్తి డిటెల్స్ లోకి వెళితే…

వీడియో ఇక్కడ చూడండి..

బెంగళూరులోని కెఆర్ పురం రైల్వే స్టేషన్‌లో సోమవారం రాత్రి షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుండి మంగళూరు వెళ్తున్న రైలు వేగంగా వెళుతోంది. ఇంతలో, ఒక ప్రయాణికుడు రైల్లోంచి ప్లాట్‌ఫారమ్‌ మీదకు వేలాడుతున్నాడు. అతడు పట్టాలపై పడిపోయే పరిస్థితిలో ఉన్నాడు..అతను రైలు కింద పడబోతున్న సమయంలో అక్కడే ఉన్న మాజీ సైనికుడు సతీష్, రైల్వే సిబ్బంది ప్రదీప్ కుమార్ అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు. వెంటనే అతన్ని అమాంతంగా చేతులపట్టి ప్లాట్‌ఫామ్‌ మీదకు లాగేశారు. దాంతో అతడు ప్రమాదం నుండి బయటపడ్డాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..