Viral News: స్టోర్ రూమ్ నుంచి వింత శబ్దాలు.. భయంతో వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.. ఎదురుగా.!

|

Dec 21, 2021 | 4:07 PM

ఈ మధ్యకాలంలో విషసర్పాలకు జనావాసాలు ఆవాసాలుగా మారిపోయాయి. దీనితో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు...

Viral News: స్టోర్ రూమ్ నుంచి వింత శబ్దాలు.. భయంతో వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.. ఎదురుగా.!
Python
Follow us on

ఈ మధ్యకాలంలో విషసర్పాలకు జనావాసాలు ఆవాసాలుగా మారిపోయాయి. దీనితో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు వైరల్ వీడియోలు తరచూ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాకుళం ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు నివాస ఆవరణలో అత్యంత ప్రమాదకరమైన రక్తిపింజర పాము కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళం సిటీలోని 80 అడుగుల రోడ్‌‌లో ఉన్న ఎంపీ కింజరాపు రామ్మోహనాయుడు నివాసంలో అత్యంత విషపురితమైన రక్తపింజర పాము కలకలం రేపింది. ఆ ఇంటి వెనుక ఉన్న ఓ స్టోర్ రూమ్‌లో ఈ పాము భయంకరంగా బుస కొడుతూ కనిపించింది. దీనితో ఆ బంగ్లా సిబ్బంది హడలిపోయారు. వెంటనే సమాచారాన్ని గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కి ఇవ్వడంతో.. వారు ఎంపీ ఇంటికి చేరుకొని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని రిజర్వు అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

Python 1

ఇది చదవండి:

Viral Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. ఈజీగా గుర్తించొచ్చు.. ట్రై చేయండి!

ఈ ఫోటోలో దాగున్న పామును గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్.. ట్రై చేయండి!

తల్లి ఒడిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.!