Watch: అందమైన ఫోటోషూట్‌లో ఊహించని షాక్‌.. కలర్‌ బాంబ్‌ పేలటంతో మంటలు…

|

Mar 22, 2025 | 4:14 PM

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ వయాపారడైజ్ పోస్ట్ చేసింది. ఈ సంఘటనను వధూవరులు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా నెటిజన్‌లతో షేర్‌ చేసుకున్నారు. ఇప్పుడా వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భిన్నమైన కామెంట్లు చేశారు. అందమైన రంగు బాంబులను పేల్చి అద్భుతమైన షాట్ కొట్టాలనేది వారి ప్లాన్. కానీ, వారి ప్లాన్‌ బెడిసి కొట్టిందంటూ పలువురు వ్యాఖ్యనించారు.

Watch: అందమైన ఫోటోషూట్‌లో ఊహించని షాక్‌.. కలర్‌ బాంబ్‌ పేలటంతో మంటలు...
Bride is Burned by Color Bomb
Follow us on

ప్రస్తుత రోజుల్లో పెళ్లి.. అనగానే ప్రతి జంట ముందుగా ఆలోచించేది ఫ్రీవెడ్డింగ్‌ షూట్‌ కోసం.. ఈ ప్రీవెడ్డింగ్‌ షూట్‌ ఎక్కడ జరుపుకోవాలి.. ఎలా అంటూ ఆలోచిస్తున్నారు. అందరీ కంటే భిన్నంగా ఉండాలనే ఆశతో అందమైన లోకెషన్ల తోపాటు, చిత్ర విచిత్రమైన ప్రదేశాలు, స్టంట్లు చేస్తూ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ కోసం విదేశాల నుంచి వచ్చిన ఓ జంటకు ఊహించని షాక్‌ తగిలింది. ఫోటో/వీడియో షూట్ మరింత అద్భుతంగా ఉండాలనే ఆరాటంతో చేసుకున్న ఏర్పాట్లు వారిని ఆస్పత్రి పాలు చేశాయి. సంతోషంగా జరుపుకోవాలని భావించిన పెళ్లి రోజు వారికి విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

లండన్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఓ జంట తమ వివాహానికి బెంగళూరు వచ్చారు. వారి పెళ్లి రోజున అందరిలాగే తమ పెళ్లిలోని అద్భుతమైన క్షణాలను మధురమైన జ్ఞాపకాలుగా కెమెరాల్లో బంధించుకోవాలని ఆశపడ్డారు. రంగు రంగులతో,అందమైన ఫోటోలు, వీడియోలు ఉండాలని అక్కడన్నీ కలర్‌ బాంబులు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాట్లే వారి పాలిట శాపంగా మారింది. వీడియో షూట్ చేస్తున్న సమయంలో ఆ కలర్‌ బాంబ్‌ పేలిపోయి వధువు వీపుకు నిప్పంటుకుంది. ఈ సంఘటనను వధూవరులు తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా నెటిజన్‌లతో షేర్‌ చేసుకున్నారు. ఇప్పుడా వీడియో కాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వీడియోలో, వరుడు వధువుతో కలిసి షూట్‌లో పాల్గొన్నాడు.. అంతలోనే పెయింట్ బాంబు పేలింది. అందులో ఒక నిప్పురవ్వ విరజిమ్మటంతో అది వధువు వీపుపై పడింది. దాంతో ఆమె పెళ్లి బట్టలు కాలిపోవడంతో పాటు వీపుపై కూడా గాయమైంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పేజీ వయాపారడైజ్ పోస్ట్ చేసింది. వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భిన్నమైన కామెంట్లు చేశారు. అందమైన రంగు బాంబులను పేల్చి అద్భుతమైన షాట్ కొట్టాలనేది వారి ప్లాన్. కానీ, వారి ప్లాన్‌ బెడిసి కొట్టిందంటూ పలువురు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..