పొట్టిగా ఉన్నావు.. నువ్వేం చేస్తావు.. అంటూ ఓ వ్యక్తిని ఎగతాళి చేశారు. కానీ ఆ వ్యక్తి ఇప్పుడు బాడీబిల్డర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. తనను ఇబ్బంది పెట్టిన వారికి తన రికార్డుతో బుద్ధు చెప్పాడు.
ప్రతీక్ మోహిత అనే 25 ఏళ్ల వ్యక్తి చాలా బాధపడేవాడు. ఎందుకంటే అతడి ఎత్తు 103 సెం.మీ ఎత్తు అంటే సుమారు 3 అడుగుల 4 అంగుళాలు మాత్రమే. అతన్ని అందరు పొట్టి వాడని ఎగతాళి చేసేవారు. అతను ఏం పట్టించుకోకుండా తన పేరును ప్రపంచానికి చాటిచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకు బాడీబిల్డింగ్‌ను ఎంచుకుని కష్టపడ్డాడు. ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తు గల బాడీబిల్డర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నాడు. తనను ఎగతాళి చేసిన వారికి సమాధానం ఇచ్చాడు.
Read Also.. Guinness Record: చెన్నై కుర్రాడి సాహసం.. రెండు చక్రాలతో ఆటో నడిపాడు.. రికార్డు సృష్టించాడు..