Trending Photo: ప్రజంట్ సొసైటీలో తినడానికి ఫుడ్ లేని వ్యక్తి అయినా కనిపిస్తాడు కానీ.. చేతిలో సెల్‌ఫోన్ లేని వ్యక్తి మాత్రం కనిపించడు. అత్యవసర, నిత్యవసర వస్తువుల్లో ఇప్పుడు సెల్‌ఫోన్ కూడా ఓ భాగమైపోయింది. ఎంతగా అది జనాల జీవితాల్లో కలిసిపోయిందంటే కళ్లు తెరవగానే చూసేది ఫోనునే, నిద్రపోయేముందు చివరగా చూసేది ఫోనునే. అందుకే ఫోన్ లేనిదే కొన్ని నిమిషాలు కూడా గడవని పరిస్థితి ఎంతో మందిది. అందుకే ఓ హోటల్ యజమాని సరికొత్త ఆలోచన చేశాడు. తినేటప్పుడు మొబైల్ స్వైప్ చేయడం కష్టమవుతుందని భావించి ఏకంగా ప్లేట్‌లోనే మొబైల్ కోసం ప్రత్యేకించి స్థానం ఇచ్చేశాడు. పైన చూస్తున్నారుగా, న్యూ జనరేషన్ ప్లేట్..ఎలా ఉందో…!. అయితే, ఇది ఎక్కడో తెలియదు గానీ, ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ప్లేటులో కూర, పచ్చడి, స్వీటు, చపాతీ పెట్టేందుకు ప్రత్యేక స్థానం ఉన్నట్టే సెల్ ఫోన్ పెట్టుకోవడానికి కూడా చక్కగా ప్లేస్ అరెంజ్ చేశాడు. హాయిగా తినే కంచంలోనే ఫోన్ పెట్టుకుని చూస్తూ తినొచ్చు ఇక. తింటూ ఫోన్ చూడటం ఇబ్బంది అనుకునేవారు.. ఈ పద్ధతిని ఫాలో అవ్వొచ్చు. పైత్యం నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడం అంటే ఇదేనేమో..!
Also Read: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Andhra Pradesh: వేసి 3 నెలలు కూడా కాలేదు.. రోడ్డు పరిస్థితి చూస్తే ఫ్యూజులు ఔట్