అనంతపురం, అక్టోబర్25; పెంపుడు కుక్కల రకరకాల విన్యాసాలు మనం చాలానే చూశాం.. కానీ, ఇలాంటి వెరైటీ కుక్కను మాత్రం మనం ఇప్పటి వరకు చూసి ఉండం..ఎందుకంటే.. ఈ కుక్క వెరీ స్పెషల్.. అంటే ఏంటి అనుకుంటున్నారా.. ఈ పెంపుడు కుక్క తన యజమానికి ఎన్నో విధాలుగా సాయం చేస్తుంది. అతడు చేసే వ్యవసాయ పనుల్లో కూడా అతనికి సహకరిస్తుంది. మొక్కజొన్న పొత్తులు, కొబ్బరికాయ పీచు తీసే పెంపుడు శునకాన్ని మీరు ఎపుడైనా చూసారా..? ఇదిగో ఇక్కడ అలాంటి ఒక్క పెంపుడు కుక్క మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
అనంతపురం జిల్లా విడపనకల్ మండలం గడేకల్లులోని రవి అనే వ్యక్తి పెంచుకుంటున్న ఈ కుక్క యవ్వారం చూస్తుంటే కొబ్బరికాయని చూసి మటన్ ముక్క అనుకుందో….??? లేక కోడి రెక్క అనుకుందో??? తెలియదు. కానీ కొబ్బరికాయ కనిపిస్తే చాలు పీచు తీయడానికి సిద్దం అవుతోంది.. ఎంత గట్టిగా ఉన్న కొబ్బరికాయ పీచునైనా చక్కగా తీస్తూ… యజమానికి సాయం చేస్తోంది.
ఈ పెంపుడు కుక్క కొబ్బకాయ మాత్రమే కాదు… మొక్క జొన్న కంకుల పైన ఉన్న పీచు కూడా చక్కగా తీసి పెడుతోంది.. కొబ్బరికాయ కాకుండా…. ఈ కుక్కకు మనిషి పిక్క దొరికితే పరిస్థితి ఏంటో….. మొత్తం మీద ఆ కుక్క మాత్రం పీచు తీయడంలో తగ్గేదేలే అంటోంది..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..