ఫిలిప్పీన్స్‌లో చౌక బట్టలకోసం …

| Edited By:

Nov 23, 2019 | 5:48 PM

మన దేశంలో.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రూపాయలకే చీర అని ఏ షాపు ముందైనా బోర్డు వెలసిందంటే చాలు.. ఇక ఆ షాపు ముందు మహిళలు చాంతాడంత క్యూలు కడతారు. ఎగబడతారు కూడా.. తరచు తొక్కిసలాటలూ సహజం. ఇందుకు ఫిలిప్పీన్స్ కూడా అతీతం కాదని నిరూపించుకుంది. అక్కడి ‘ జనరల్ శాంటోస్ సిటీ ‘ అనే నగరంలో విదేశాల నుంచి దిగుమతి అయిన డిజైనర్ క్లాత్ లను ఓ షాపింగ్ మాల్ ప్రదర్శనకు పెట్టింది. […]

ఫిలిప్పీన్స్‌లో చౌక బట్టలకోసం ...
Follow us on

మన దేశంలో.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రూపాయలకే చీర అని ఏ షాపు ముందైనా బోర్డు వెలసిందంటే చాలు.. ఇక ఆ షాపు ముందు మహిళలు చాంతాడంత క్యూలు కడతారు. ఎగబడతారు కూడా.. తరచు తొక్కిసలాటలూ సహజం. ఇందుకు ఫిలిప్పీన్స్ కూడా అతీతం కాదని నిరూపించుకుంది. అక్కడి ‘ జనరల్ శాంటోస్ సిటీ ‘ అనే నగరంలో విదేశాల నుంచి దిగుమతి అయిన డిజైనర్ క్లాత్ లను ఓ షాపింగ్ మాల్ ప్రదర్శనకు పెట్టింది. వేలాది పీసోల (అక్కడి కరెన్సీ) ధర పలికే వీటిని అతి చౌక ధరకే అమ్ముతామని ప్రకటించడంతో.. జనాలు ఇక ఆ మాల్ మీద ఎగబడ్డారు. ఇదే అదనని కొందరు వాటిని చేజిక్కించుకునేందుకు ఘర్షణలకు దిగారు. మరికొంతమంది టేబుల్ పైకెక్కి తమకు అందినన్ని బట్టలను ‘ దోచుకుపోయారు ‘. ఈ తొక్కిసలాటలో ఒక వ్యక్తి చిక్కుకుపోయి గాయపడ్డాడు. భూకంపాలు, వరదల వంటి విపత్తులతో తల్లడిల్లుతున్న ఫిలిప్పీన్‌వాసులు… ఇలా చౌక ధరకే విదేశీ వస్త్రాలు అమ్ముతున్నారంటే వాటి కోసం ఎగబడడం సహజం.