మంచి ఘనురాలే.. ఉక్కపోతగా ఉందని విమానం కిటికీ తెరిచిందట

విమానం ఎక్కడం కొత్తనో..? లేక సెన్సేషనల్‌గా మారాలనుకుందో..? తెలీదు గానీ తన చర్యతో విమాన సిబ్బందిని ముక్కున వేలేసుకునేలా చేసింది ఓ మహిళ. ఉక్కపోతగా ఉందని విమానం కిటీకిని తెరిచి పెట్టుకుంది ఆ మహిళ. దీంతో విమానం స్టార్ట్ అవ్వకపోగా.. అందులో ఉన్న ప్రయాణికులు గంట సమయం వృథా అయ్యింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గాన్సు నుంచి హుబే ప్రావిన్సులోని వుహాన్‌కు వెళ్లాల్సిన షియామెన్‌ ఎయిర్‌ జెట్‌ టేకాఫ్‌ కావడానికి […]

మంచి ఘనురాలే.. ఉక్కపోతగా ఉందని విమానం కిటికీ తెరిచిందట
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2019 | 3:12 PM

విమానం ఎక్కడం కొత్తనో..? లేక సెన్సేషనల్‌గా మారాలనుకుందో..? తెలీదు గానీ తన చర్యతో విమాన సిబ్బందిని ముక్కున వేలేసుకునేలా చేసింది ఓ మహిళ. ఉక్కపోతగా ఉందని విమానం కిటీకిని తెరిచి పెట్టుకుంది ఆ మహిళ. దీంతో విమానం స్టార్ట్ అవ్వకపోగా.. అందులో ఉన్న ప్రయాణికులు గంట సమయం వృథా అయ్యింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని గాన్సు నుంచి హుబే ప్రావిన్సులోని వుహాన్‌కు వెళ్లాల్సిన షియామెన్‌ ఎయిర్‌ జెట్‌ టేకాఫ్‌ కావడానికి సిద్ధంగా ఉంది. ఈలోపు విమానంలో కూర్చున్న ఓ మహిళ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ కిటీకిని తెరిచింది. దీంతో విమానం స్టార్ట్‌ కాలేదు. కారణం ఏమై ఉంటుందా..? అని ఆలోచించిన సిబ్బందికి కిటికీ తెరిచి ఉండటం కంటబడింది. దీన్ని గమనించి వెంటనే ఆమె వద్దకు వెళ్లి అడగ్గా ఉక్కపోతగా ఉందని, గాలికోసం కిటికీని తెరిచానని చెప్పింది. ఈ సమాధానంతో అక్కడున్న అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటనపై వెంటనే అక్కడే ఉన్న పోలీసులకు సమాచారమివ్వగా విమానంలో తనిఖీలు చేశారు. దీంతో గంట ఆలస్యంగా విమానం బయలుదేరింది. ఇక ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..