మూడేళ్ల తరువాత, యజమానికి కనిపించిన తప్పిపోయిన కుక్క.. కన్నీళ్లు తెప్పించిన ఘటన!

మనుషులు, జంతువుల మధ్య ఉన్న బంధాన్ని వర్ణించడం చాలా కష్టం. విధేయత, నమ్మకం, ఆప్యాయత, విశ్వాసానిక ప్రతీక శునకం. కుక్క, దాని యజమాని మధ్య ఈ భావాలు కనిపించినప్పుడు, కథ కేవలం కథగా నిలిచిపోతుంది. అంతేకాదు భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఒక కుక్క తన యజమానితో తిరిగి కలిసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మూడేళ్ల తరువాత, యజమానికి కనిపించిన తప్పిపోయిన కుక్క.. కన్నీళ్లు తెప్పించిన ఘటన!
Missing Dog

Updated on: Nov 23, 2025 | 8:31 PM

మనుషులు, జంతువుల మధ్య ఉన్న బంధాన్ని వర్ణించడం చాలా కష్టం. విధేయత, నమ్మకం, ఆప్యాయత, విశ్వాసానిక ప్రతీక శునకం. కుక్క, దాని యజమాని మధ్య ఈ భావాలు కనిపించినప్పుడు, కథ కేవలం కథగా నిలిచిపోతుంది. అంతేకాదు భావోద్వేగ ప్రయాణంగా మారుతుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఒక కుక్క తన యజమానితో తిరిగి కలిసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూస్తూ ఎవరిక కళ్ళలోనైనా నీళ్లు తిరగక మానవు. ఎటువంటి వారి ముఖాల్లోనైనా హృదయాన్నైనా కరిగించే చిరునవ్వులు పూస్తాయి. నిజమైన ప్రేమ ఎక్కడైనా ఉంటే, అది ఈ రెండు ఆత్మల కలయికలో ఉందని చెప్పకుండా ఉండలేరు.

జార్జియా రాజధాని టిబిలిసిలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా హృదయాలను కదిలిస్తోంది. ఆ కుక్క పేరు జార్జ్, దాని యజమాని గియోర్గి బెరెజియాని. ఆ రెండింటి మధ్య బంధం చాలా గాఢంగా ఉంది. కానీ 2015లో, జార్జ్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. ఎన్నో వీధుల్లో వెతికారు. పొరుగు ప్రాంతాలను వెతికారు. కానీ మూడు సంవత్సరాలుగా, గియోర్గికి తన ప్రియమైన సహచరుడి గురించి ఎటువంటి వార్త దొరకలేదు. అతను ఆశ వదులుకోలేదు. నగరమంతా పోస్టర్లు అంటించి ప్రజలను ప్రశ్నించాడు. కొన్నిసార్లు ప్రజలు శునకాన్ని ఎక్కడో చూశామని చెప్పారు. కొన్నిసార్లు తమకు తెలియదని చెప్పారు. కానీ గియోర్గి ఎప్పుడూ ఆశ కోల్పోలేదు.

ఈ వీడియో  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

2018 లో, విధి మలుపు తిరిగింది. టిబిలిసి ఒపెరా హౌస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు చెవిలో జంతు నియంత్రణ టీకా ట్యాగ్ ఉన్న గోధుమ రంగు కుక్కను గమనించారు. కుక్క ప్రశాంతంగా ఉంది. కానీ దాని కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నట్లు అనిపించింది. ఉద్యోగులు వెంటనే ఫోటో తీసి నగరం చుట్టూ విచారించడం ప్రారంభించారు. చివరికి జార్జికి చేరుకున్నారు. ఆ ఫోటోను చూసి, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, “అది నా జార్జ్” అని అన్నాడు.

జార్జి సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, అక్కడ జరిగిన దృశ్యం అందరినీ కదిలించింది. జార్జి తన యజమాని గొంతు విన్న వెంటనే, అతని వైపు పరిగెత్తి, తోక ఊపుతూ, కాళ్ళకు అతుక్కుని కన్నీళ్లు పెట్టుకుంది. జార్జి తనను తాను ఆపుకోలేక రోడ్డు పక్కన కూర్చుని, తన సహచరుడిని కౌగిలించుకుని, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. లక్షలాది మంది దీనిని చూశారు. ఈ వీడియో మానవత్వాన్ని తిరిగి మేల్కొలిపిందని అందరూ అంటున్నారు.

సోషల్ మీడియాలో brain.nourishmentt అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీనిని లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు, “వీడియో చూసిన తర్వాత నేను ఏడుపు ఆపుకోలేకపోతున్నాను.”అని రాశాడు. మరొకరు, “నాకు కూడా ఒక కుక్క ఉంది, నాకు ఏడవాలనిపిస్తుంది.” అని రాశాడు. మరొక వినియోగదారు, “నేను నా కుక్కను ఐదు నిమిషాలు కూడా చూడకపోతే, నా గుండె దడదడలాడుతుంది.” అంటూ పేర్కొన్నాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..