Optical illusions: ఈ చెట్ల మాటున దాగున్న ఆడ పిల్లను గుర్తుపట్టండి..’తలకిందులు తపస్సు చేస్తే కానీ’ దొరకదు..

ప్రస్తుతం సోషల్‌ మీడియా ట్రెండ్స్‌లో ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఒకటి. సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇలాంటి పజిల్స్‌ నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. మెదడుకు మేత పెట్టే విధంగా ఉండే ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలకు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు....

Optical illusions: ఈ చెట్ల మాటున దాగున్న ఆడ పిల్లను గుర్తుపట్టండి..తలకిందులు తపస్సు చేస్తే కానీ దొరకదు..
Optical Illusions

Updated on: Dec 07, 2022 | 11:17 AM

ప్రస్తుతం సోషల్‌ మీడియా ట్రెండ్స్‌లో ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఒకటి. సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇలాంటి పజిల్స్‌ నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. మెదడుకు మేత పెట్టే విధంగా ఉండే ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలకు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే రోజుకో కొత్త ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పైన ఉన్న ఫొటో చూడగానే ఒక అడవి కనిపిస్తోంది కదూ! అయితే ఇందులో ఒక మహిళ ముఖం దాగుంది కనిపెట్టారా.?

ఆర్టిస్ట్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోన్న ఈ ఫొటోలో చెట్ల కొమ్మలనే అమ్మాయి ముఖంలాగా రూపొందించారు. మనసు పెట్టి ఎంతో జాగ్రత్తగా గమనిస్తే కానీ కనిపించదు. అయితే ఇందులోనూ ఓ ట్విస్ట్‌ ఉంది. ఫొటోను సాధారణంగా ఎంత సేపు గమనించినా మీకు అందులోని ముఖం కనిపించదు. నెటిజన్లు మరింత కన్ఫ్యూజ్‌ చేయడానికి ఒక ట్రిక్‌ను ఫాలో అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఫొటోను నేరుగా కాకుండా ఒకసారి రివర్స్‌ చూడండి వెంటనే ముఖం కనిపిస్తుంది. ఏంటి ఇప్పటికీ గుర్తు పట్టలేదా.? అయితే ఓ సారి పెద్ద చెట్టు పక్కన ఉన్న కొమ్మలను ఓ సారి గమనించండి. ఆకుల మధ్యలో ముక్కు, కన్ను, నోరు ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది కదూ. ఎంత వెతికినా పజిల్‌ను సాల్వ్‌ చేయకపోతే సమాధానం కోసం ఓసారి కింద ఫొటోను చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us