Viral: దమ్ముంటే కాస్కో.. కుందేలును పట్టుకో.. 5 సెకన్లలో కనిపెడితే మీరు తోపే.. ట్రై చేయండి..

|

Jan 08, 2023 | 1:13 PM

సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు దిమ్మతిరిగేలా నెటిజన్లను సవాల్ చేస్తుంటాయి. చూడటానికి ఏం లేనట్టు కనిపించే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు..

Viral: దమ్ముంటే కాస్కో.. కుందేలును పట్టుకో.. 5 సెకన్లలో కనిపెడితే మీరు తోపే.. ట్రై చేయండి..
Optical Illusion
Follow us on

సోషల్ మీడియాలో తరచూ కొన్ని ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు దిమ్మతిరిగేలా నెటిజన్లను సవాల్ చేస్తుంటాయి. చూడటానికి ఏం లేనట్టు కనిపించే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మన కళ్లను మోసం చేసేలా ఉంటాయి. అయితే, వీటిని అంత తేలికగా పరిష్కరించడం చాలా మందికి సాధ్యం కాదు. అందుకే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలలో ఉన్న విషయాలను గుర్తించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. తాజాగా అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో కుందేలు దాగి ఉంది. అది ఎక్కడ దాగి ఉందో కనుక్కోండి అంటూ నెటిజన్లు సవాల్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో ఓ జంట అటవీ ప్రాంతంలో విహారయాత్రలో ఉన్నట్లు కనిపిస్తోంది. వారి చుట్టూ కొన్ని జంతువులు, పక్షులు కనిపిస్తున్నాయి. ఆ జంట వెంట పెంపుడు కుక్క ఉంది. అలాగే పైన ఉన్న కొమ్మపై గుడ్లగూబ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంతలో ఒక కుందేలు కూడా వచ్చింది. ఈ చిత్రంలో ఈ కుందేలును కనుగొని అది ఎక్కడ ఉందో చెప్పండి.

ఈ చిత్రంలో తమాషా ఏమిటంటే ఇందులో దాగున్న కుందేలు అస్సలు కనిపించదు. ఈ జంట దగ్గర చెట్లు, పక్షులు కనిపిస్తాయి. కానీ ఆ కుందేలు మాత్రం కనిపించడం లేదు. అయితే, మీరు కుందేలును కనుగొంటే.. మీ మైండ్ షార్పుగా ఉన్నట్లే అర్ధం. ఇంకా మీ కళ్లు కూడా డేగ కళ్లేనంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, దీనికి షరతు కూడా విధించారు. కేవలం ఐదు సెకన్లలో కుందేలును కనుగొనాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇంకెందుకు ఆలస్యం ఈ చిత్రంలో కుందేలు ఎక్కడ దాగి ఉందో కనుగొనండి..

Optical Illusion

మీరు ఇంకా కుందేలును కనుగొనలేకపోతే.. చింతించకండి.. సరైన సమాధానం ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. నిజానికి ఈ చిత్రంలో ఈ కుందేలు పడిపోయిన చెట్టు దగ్గర ఇరుక్కుపోయి కూర్చుంది. కుందేలు కనిపించని విధంగా చిత్రంతో సెట్ చేశారు. కానీ జాగ్రత్తగా గమనిస్తే కుందేలు ఎక్కడ ఉందో తెలుస్తుంది.

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..