Optical illusion: ఇందులో రెండు పిల్లులున్నాయి.. కనిపించాయా.?

|

Jan 12, 2024 | 8:19 PM

ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో కొన్ని మెదడుకు మేత పెట్టేవి అయితే, మరికొన్ని కంటి పవర్‌ను టెస్ట్ చేసేవి ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఐ టెస్ట్‌కు సంబంధించిన ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయడానికి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు కానీ...

Optical illusion: ఇందులో రెండు పిల్లులున్నాయి.. కనిపించాయా.?
Optical Illusion
Follow us on

సోషల్‌ మీడియా యుగంలో ఆప్టికల్ ఇల్యూజన్‌కు భారీగా రెస్పాన్స్‌ లభిస్తోంది. ముఖ్యంగా యువత, చిన్నారులను అట్రాక్ట్ చేసే క్రమంలో నెట్టింట విభిన్న రకాల ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో కొన్ని మెదడుకు మేత పెట్టేవి అయితే, మరికొన్ని కంటి పవర్‌ను టెస్ట్ చేసేవి ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి ఓ ఐ టెస్ట్‌కు సంబంధించిన ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయడానికి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు కానీ, మీ కంటి పవర్‌ మాత్రం బాగుండాలి. ఇంతకీ ఆ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పైన ఉన్న ఫొటోను గమనించగానే ఏం కనిపిస్తోంది..? ఏముంది ఓ టీపాయ్‌, దాని పక్కన కెమెరా వైపు చూస్తున్న ఓ పిల్లి అంతే అంటారా.? అయితే ఇందులో మరో పిల్లి దాగుంది.? ఆ రెండో పిల్లిని కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ముఖ్య ఉద్దేశం. మరి ఈ పజిల్‌ను సాల్వ్‌ చేసేంత శక్తి మీ కంటికి ఉందా ఒకసారి చెక్‌ చేసుకోండి.

ఏంటి ఎంత వెతికినా కనిపించడం లేదా. ఓసారి ఆ ఫొటోపై వెనకాల కనిపిస్తున్న గ్రిల్‌పై లుక్కేయండి. ఆ గ్రిల్‌ వెనకాల మరో చిన్న పిల్లి తొంగి తొంగి చూస్తోంది కనిపించిందా.? ఎంత ప్రయత్నించినా సమాధానం దొరక్కపోతే సమాధానం కోసం ఓ సారి కింది ఫొటోలో చూడండి.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్  కోసం క్లిక్ చేయండి..