Viral Photo: బుర్ర తిరుగుద్ది.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే కిర్రాక్! ట్రై చేయండి..

|

Jun 02, 2022 | 5:59 PM

ఫోటో పజిల్స్.. మన మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పదునుపెడతాయి. సవాళ్లను ఇష్టపడేవారు వీటిని చిటికెలో సాల్వ్ చేసేస్తారు...

Viral Photo: బుర్ర తిరుగుద్ది.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే కిర్రాక్! ట్రై చేయండి..
Snake
Follow us on

ఈ మధ్యకాలంలో టైం పాస్ కోసం ఇంటర్నెట్‌లోకి వెళ్తే చాలు.. రకరకాల రీల్స్, వీడియోలు, ఫోటోలు ఇలా ఎన్నో దర్శనమిస్తున్నాయి. ఇదివరకు సుడోకోలు, పద సంపత్తి వంటి వాటిని తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పట్టేసిన నెటిజన్లు.. ఇప్పుడు ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలపై దృష్టి పెట్టారు. వీటికంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పలు పేజీలు ఉన్నాయి. ఫోటో పజిల్స్.. మన మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పదునుపెడతాయి. సవాళ్లను ఇష్టపడేవారు వీటిని చిటికెలో సాల్వ్ చేసేస్తారు. ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఎండిన కర్రలు, చెట్టు కొమ్మలతో నిండిన ఆ ప్రాంతంలో ఓ విషపూరిత పాము నక్కింది. అక్కడున్న దుంగల రంగులో ఆ పాము ఇమిడిపోయి ఉండటంతో దాన్ని కనిపెట్టడం కొంచెం కష్టమే. మరి మీరూ ఓసారి పజిల్‌పై లుక్కేయండి.. ఫోటోను నిశితంగా చూస్తే పామును కనిపెట్టేస్తారేమో ట్రై చేయండి.. లేదంటే.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి..

ఇవి కూడా చదవండి

సమాధానం: ఫోటోకు కుడివైపు.. పెద్ద చెట్టు కొమ్మపై ఓ లుక్కేయండి..