
North Indian Train Fight Video: రైలు ప్రయాణం అంటేనే సరికొత్త పరిచయాలు, ఆహ్లాదకరమైన క్షణాలు గుర్తొస్తాయి. కానీ, ఇటీవల కాలంలో భారతీయ రైల్వేల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తోటి ప్రయాణికులు మృగాల్లా ప్రవర్తిస్తూ, ఒకరిపై ఒకరు దాడికి దిగుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ఉత్తర భారత దేశంలో ప్రయాణిస్తున్న ఒక రైలులో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉండే జనరల్ లేదా స్లీపర్ క్లాస్ బోగీల్లో ఇలాంటి గొడవలు జరుగుతుంటాయి. కానీ, ఈ వీడియోలో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకోవడం కలకలం రేపుతోంది. తోటి ప్రయాణికులు వారించడానికి ప్రయత్నిస్తున్నా, ఆగ్రహంతో ఊగిపోతున్న సదరు వ్యక్తులు అస్సలు తగ్గడం లేదు.
North Indian Train, Fight 😲💥 pic.twitter.com/ilc2geUIkO
— Sai • சாய் (@SaiAnvii) June 4, 2026
ఫుల్ రద్దీగా ఉన్న ట్రైన్‌లో ఓ మహిళ కూర్చోవడానికి సీటు లేక తన లగేజీ బ్యాగ్‌తో ఇబ్బందిపడుతుంది. అయితే, పైన ఖాళీగా ఉందని తన బ్యాగ్‌ను గట్టిగా విసిరేస్తుంది. ఈ క్రమంలో ఆ బ్యాగ్ పక్కనే ఉన్న తోటి ప్రయాణికుడిపై పడుతుంది. అది గట్టిగా తలగడంతో సదరు ప్రయాణికుడు ఆ బ్యాగ్‌ను ఆ మహిళపై విసిరేస్తాడు. దీంతో కోపం పట్టలేని మహిళ, ఆ కుర్రాడిపై యుద్ధానికి దిగుతుంది. ఇక ఇద్దరు జట్టు పట్టుకుని, బూతులు తిట్టుకుంటూ పొట్టుపొట్టుగా కొట్టున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
సామాజిక మాధ్యమమైన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా బయటకు వచ్చిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రత ఎక్కడ ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రైలులో ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది ఎందుకు అందుబాటులో లేరని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం, తోటి మనుషుల పట్ల కనీస సహనం కోల్పోతున్న నేటి సమాజ పోకడలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..