Viral Video: డబ్బు ఉంటే నెత్తిన కొమ్ములు మొలుస్తాయా..? ఈ మహిళకు ఎంత అహంకారం

|

Sep 11, 2022 | 4:52 PM

Noida viral video: గేటు తీయడం కొంచెం ఆలస్యమైంది అంతే.. మేడమ్ గారికి విపరీతమైన కోపం వచ్చింది. రావడం.. రావడమే.. గార్డు చెంపపై కొట్టింది.

Viral Video: డబ్బు ఉంటే నెత్తిన కొమ్ములు మొలుస్తాయా..? ఈ మహిళకు ఎంత అహంకారం
Viral Video
Follow us on

Trending Video: డబ్బు ఉంటే నెత్తిపై కొమ్ములు మొలుస్తాయా..? చిన్న, చిన్న ఉద్యోగాలు చేసేవారిని.. పేదవారిని కనీసం మనుషుల్లా కూడా చూడరా..?. ఇదేం అహం… ఇదేం బలుపు. ప్రజంట్ వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ ఇవి. నోయిడా(Noida)సొసైటీలో ఓ మహిళ సెక్యూరిటీ గార్డును పలుసార్లు చెంపపై కొట్టింది. నోయిడాలోని ఫేజ్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని క్లియో కౌంటీ సొసైటీలో ఈ ఘటన వెలుగుచూసింది.  గేటు తెరవడంలో జాప్యం చేసినందుకు గార్డుపై ఆమె దాడి చేసింది. షాకింగ్ సంఘటన సీసీటీవీలో రికార్డయ్యింది.  గార్డును చెంపదెబ్బ కొట్టిన మహిళ వృత్తిరీత్యా ప్రొఫెసర్ అని తెలిసింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గత నెలలో నోయిడాలోని సెక్టార్ 128లోని జేపీ గ్రూప్ సొసైటీకి చెందిన సెక్యూరిటీ గార్డులతో భవ్య రాయ్ (32) అనే మహిళ వాగ్వాదానికి దిగింది. గార్డులలో ఒకరిని కాలర్ పట్టుకుని.. ముఖంపై దాడి చేసింది. బూతులు తిడుతూ.. వారిని బెదిరించింది. ఈ ఘటన తీవ్రస్థాయిలో వైరల్ అవ్వడంతో.. పోలీసులు.. ఆమెను అరెస్టు చేసి 14 రోజుల పాటు కస్టడీలో ఉంచారు. ఆమెకు స్థానిక కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..