పుట్టుకతోనే మీసాలు, గడ్డం.. ఏఐ సృష్టి?

Viral Video: అప్పుడే పుట్టిన పిల్లలు ఎంతో ముద్దుగా కనిపిస్తారు. ఓ నవజాత శిశువు ఆశ్చర్యపరుస్తున్నాడు. బుజ్జాయి ముఖంపై దట్టమైన మీసాలు, గడ్డం ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటూనే.. ఇది నిజమైన వీడియోనా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించారా? అని చర్చించుకుంటున్నారు.

పుట్టుకతోనే మీసాలు, గడ్డం.. ఏఐ సృష్టి?
Newborn With Moustache Viral Internet Asks Is It Ai Generated

Updated on: Oct 26, 2026 | 9:43 AM

Viral Video: అప్పుడే పుట్టిన పిల్లలు ఎంతో ముద్దుగా కనిపిస్తారు. కానీ, ఓ నవజాత శిశువు ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎందుకంటే.. ఆ బుజ్జాయి ముఖంపై దట్టమైన మీసాలు, గడ్డం ఉన్నట్లు కనిపిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటూనే.. ఇది నిజమైన వీడియోనా? లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించారా? అని చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా ఓ నవజాత శిశువు ముఖంపై పెద్దవారిలా దట్టమైన మీసాలు, గడ్డం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు సరదాగా కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు అసలు ఈ వీడియో నిజమైందేనా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

పుట్టుకతోనే మీసాలు, గడ్డం.. వీడియోలో ఏముంది?

వీడియోను టిక్‌టాక్‌లో ఓ యూజర్ షేర్ చేసాడు. ఆసుపత్రి బెడ్‌పై ఓ నవజాత శిశువు కనిపిస్తున్నాడు. చిన్న టవల్‌తో చుట్టి ఉన్న ఆ బుజ్జాయి కళ్లు తెరుస్తూ, తలను కదిలిస్తున్నాడు. ఓ మహిళ మెల్లగా ఆ చిన్నారిని తాకినప్పుడు ముఖంలో చిరునవ్వు కనిపించింది. పై పెదవిపై దట్టమైన నల్లటి మీసాలు ఉన్నాయి. గడ్డం కింద వెంట్రుకలు ఉండటంతో చిన్నారి ముఖం ఓ మధ్య వయస్కుడిని తలపిస్తోంది.  కనుబొమ్మలు, కళ్లు తెరిచే విధానం కూడా వీడియోకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

‘పుట్టగానే కష్టాల్లోకి వెళ్లిపోయాడు!’

వీడియో చూసిన నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారి ముఖం చూస్తుంటే అప్పటికే జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడని జోకులు వేస్తున్నారు. ఈ బాబు కిండర్‌గార్టెన్‌ను దాటేసి నేరుగా మిడ్‌లైఫ్ క్రైసిస్‌లోకి వెళ్లిపోయాడు. పుట్టినప్పుడే రిటైర్ అయ్యాడు.. అతడికి ముగ్గురు పిల్లలు, రెండు ఇళ్ల రుణాలు ఉన్నట్లున్నాయని ఓ యూజర్‌ చమత్కరించాడు. పుట్టి కేవలం రెండు గంటలే అయినా, అప్పటికే రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో పని చేసి అలసిపోయిన మేనేజర్‌లా కనిపిస్తున్నాడని ఇంకొకరు కామెంట్ చేశారు.

బుడ్డోడి ఫొటోలతో రకరకాల ఎడిట్స్!

ఈ చిన్నారి రూపం నెటిజన్లకు కొత్త ఆలోచన వచ్చేలా చేసింది. కొందరు ఫొటోలను ఎడిట్ చేసి రకరకాల రూపాల్లో చూపిస్తున్నారు. సైనిక దుస్తులు, పతకాలు ధరించినట్లు.. ఓ పెద్ద కుర్చీలో కూర్చొని ‘సుప్రీం లీడర్‌’గా వ్యవహరిస్తున్నట్లు, మరికొన్ని ఎడిటెడ్ ఫొటోల్లో బిజినెస్ సూట్ ధరించి సిగార్ పట్టుకున్నట్లు చూపించారు. ఇంకొన్ని చిత్రాల్లో హెల్మెట్, కవచం ధరించిన యోధుడిలా చూపించారు. ఈ ఫొటోలు కూడా సరదా కోసం రూపొందించినవే. అయితే, వీడియోలోని చిన్నారి నిజంగా  మీసాలు, గడ్డంతో పుట్టాడా? అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు.

అప్పుడే పుట్టిన పిల్లలకు సహజంగా వెంట్రుకలు ఉంటాయా?

వైద్యపరంగా చూస్తే, కొందరు పిల్లలకి పుట్టినప్పుడు శరీరంపై సన్నని, మృదువైన వెంట్రుకలు ఉంటాయి. వీటిని ‘లానుగో’ (Lanugo) అంటారు. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ వెంట్రుకలు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా వీపు, భుజాలు, చెవులు, ముఖంపైన కనిపిస్తాయి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఆ వెంట్రుకలు సహజంగానే రాలిపోతాయి. అయితే, లానుగో వెంట్రుకలు లేతగా ఉంటాయి. వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు దట్టంగా, స్పష్టమైన ఆకారంలో మీసాలు, గడ్డం సాధారణ లక్షణం కాదు.

ఇది నిజమైన వీడియోనా? ఏఐ సృష్టా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర డిజిటల్ ఎడిటింగ్ టూల్స్ సాయంతో మీసాలు, గడ్డం జోడించారని కొందరు అనుమానిస్తున్నారు. వీడియోలో చిన్నారి కదులుతున్నప్పుడు మీసాల ఆకారం స్వల్పంగా మారిందని, ముఖంపై వెలుతురుతో మీసాల రూపం సరిపోలడం లేదని కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఆ చిన్నారి ఎక్కడ, ఎప్పుడు పుట్టాడనే వివరాలు తెలియలేదు. ఆసుపత్రి రికార్డులు, వైద్యుల ధ్రువీకరణ లేదా కుటుంబ సభ్యుల నుంచి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us