చిన్నారి బాహుబలి.. పుట్టిన వెంటనే డాక్టర్‌నే ఆపేసింది! పసికందు పట్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్ల మనసు గెలుచుకోవడమే కాకుండా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టిన కొద్ది క్షణాల్లోనే ఒక నవజాత శిశువు (Newborn Baby) డాక్టర్ గ్లౌజ్‌ను గట్టిగా పట్టుకున్న దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

చిన్నారి బాహుబలి.. పుట్టిన వెంటనే డాక్టర్‌నే ఆపేసింది! పసికందు పట్టు చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Newborn Viral Video

Updated on: Apr 27, 2026 | 9:08 PM

ప్రకృతి వింతలు ఒక్కోసారి మన కళ్ల ముందే జరుగుతుంటాయి. ముఖ్యంగా పసిపిల్లల చేష్టలు చాలా అమాయకంగా, ముచ్చటగా ఉంటాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక నవజాత శిశువు చూపించిన బలం చూసి డాక్టర్లు కూడా నోరెళ్లబెట్టారు. అసలేం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

ఒక ఆసుపత్రిలో ప్రసవం జరిగిన వెంటనే, డాక్టర్ ఆ చిన్నారిని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఆ శిశువు తన చిన్న చేతులతో డాక్టర్ సర్జికల్ గ్లౌజ్‌ను పట్టుకుంది. సాధారణంగా పసిపిల్లలు దేన్నైనా పట్టుకోవడం సహజమే కానీ, ఈ పాప మాత్రం డాక్టర్ తన చేతిని విడిపించుకోవాలని చూస్తున్నా అస్సలు వదల్లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పాప ఇప్పుడే భూమిపైకి వచ్చింది, అప్పుడే ఇంత గట్టి పట్టుదల ఉందా? అని ఒకరు రాశారు. నేటి కాలంలో విడిపోతున్న బంధాల కంటే ఈ పాప పట్టు చాలా దృఢంగా ఉంది అని మరొకరు భావోద్వేగంగా కామెంట్ చేశారు. నేను ఇక్కడి నుండి ఎక్కడికీ వెళ్లను అని డాక్టర్‌తో చెబుతున్నట్లు ఉంది అని మరికొందరు సరదాగా పోస్ట్లు పెడుతున్నారు.

వైద్య పరంగా దీనిని పామర్ గ్రాస్ప్ రిఫ్లెక్స్ (Palmar Grasp Reflex) అని పిలుస్తారు. శిశువు అరచేతిలో ఏ వస్తువు పెట్టినా లేదా తాకినా వారు అసంకల్పితంగా దానిని గట్టిగా పట్టుకుంటారు. ఇది పుట్టిన పిల్లల్లో ఉండే సహజ లక్షణం. అయితే ఈ వీడియోలో ఆ పాప పట్టు చాలా సేపు, గట్టిగా ఉండటంతో అందరినీ ఆకర్షించింది. ఏది ఏమైనా, మాతృ గర్భం నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ చిన్నారి ప్రపంచాన్ని పట్టుకోవాలని చూస్తున్న తీరు నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. భవిష్యత్తులో ఈ పాప ఎంతటి పట్టుదలతో ముందుకు సాగుతుందో అని అందరూ దీవిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us