ఓ జంట ఎంతగానో ముచ్చటపడి నాలుగేళ్ల కిందట 1920వ సంవత్సరంలో నిర్మించబడిన ఓ కాటేజీని కొనుగోలు చేసింది. ఇక తమకు నచ్చిన విధంగా ఆ ఇంటికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే ఇంటి బయట చెట్లు నాటేందుకు మట్టిని తవ్వారు. అంతే! అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ కథేంటంటే.!
వివరాల్లోకి వెళ్తే.. రిచర్డ్, సుజేన్ గిల్సన్ అనే జంట న్యూయార్క్‌లోని వైల్డ్‌వుడ్ ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం ఓ చిన్న కాటేజీని కొనుగోలు చేశారు. అదేమో 1920వ సంవత్సరం నిర్మించబడినది. అందుకే వారు తమకు నచ్చిన విధంగా ఆ ఇంటికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ క్రమంలోనే రిచర్డ్ ఇంటి ముందు కొన్ని చెట్లు నాటేందుకు మట్టిని తవ్వగా.. కొన్ని ప్యాకెట్లు బయటపడ్డాయి. ముందుగా ఆ జంట వాటిని గంజాయి ప్యాకెట్లని భావించారు. అయితే ఆ తర్వాత అవి గట్టిగా కట్టబడి ఉన్న నోట్ల కట్లని వారికి అర్ధమైంది. ఆ మొత్తం అంతా 2 వేల డాలర్లుగా తేలింది. ఆశ్చర్యపోయిన రిచర్డ్.. విషయాన్నీ మొత్తం తన భార్య సుజేన్‌కు చెప్పాడు. ఆ నోట్లన్నీ కూడా 1934 కాలానికి చెందినవని.. ఇప్పుడు వాటి విలువ సుమారు 40 వేల డాలర్లు ఉంటుందని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. ఆ జంట ఈ క్యాష్ ఎవరిది.? ఇక్కడెందుకు పాతిపెట్టారు.? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలోనే మొదటిగా ఈ క్యాష్ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించినదై ఉంటుందని భావించింది. అనంతరం ఆ ఇంటి అసలు ఓనర్ మనవరాలితో మాట్లాడిన తర్వాత మనీ మిస్టరీ ఎట్టకేలకు సాల్వ్ అయింది. ఆ జంట కొలొరాడోలో ఉన్న జేమ్స్ డెంప్సీ మనవరాలితో ఈ క్యాష్ గురించి మాట్లాడింది. తన తాత కొంత డబ్బును ఇచ్చి ఇంటి ముందు నేల కింద పాతిపెట్టమని అప్పట్లో తన తల్లికి చెప్పినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఎంత వెతికినా ఆ డబ్బు దొరకలేదని తెలిపింది. ఇప్పుడు ఆ డబ్బు దొరకడంతో ఆమె.. తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
“సుమారు 2 వేల డాలర్లు. అంటే పెద్ద మొత్తమే.. వీటి వల్ల మా జీవితాలు మారిపోవు. కాని ఆ నోట్ల వెనుక దాగున్న కథ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. 90 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి చేసిన పనికి ఇవి సాక్ష్యంగా మిగిలాయి. ఈ డబ్బులతో ఏం చేయబోతున్నారని చాలామంది ప్రజలు నన్ను అడిగారు. నేను మాత్రం వాటిల్లో ఒక్క డాలర్ కూడా ఖర్చు పెట్టను” అని రిచర్డ్ గిల్సన్ చెప్పాడు.(Source)