చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి పండుగ ఇప్పటికే ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ రకాలుగా పండుగ జరుపుకుంటున్నారు. నవరాత్రి ఉత్సవాలను తమ తమ ఆచార సంప్రదాయాలను అనుసరించి అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ జరుపుకుంటున్న నవరాత్రి ఉత్సవాల వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందమైన వేడుకలను చూపించే అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో దర్శనమిస్తున్నాయి. ముంబై లోకల్ ట్రైన్‌లో గర్బా చేయడం నుండి బెంగళూరు విమానాశ్రయం వరకు వందలాది మంచి చేస్తోన్న గార్భా వీడియోలు ఎంతగానో నెటిజన్లను అలరిస్తున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడిన రెండేళ్లలో అసంపూర్ణంగా జరుపుకున్న ఈ వేడుకలను ఈ ఏడాది ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వడోదరలోని మైదానంలో సాంప్రదాయ నృత్య రూపమైన గర్బా వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
అందమైన వీడియోను ANI తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో డ్రోన్ ద్వారా చిత్రీకరించబడింది. గుజరాత్ లోని వడోదరలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి పండుగ VNF లో భారీ సంఖ్యలో గర్బా ఆడతారు” అని ట్వీట్ చేశారు. సెప్టెంబరు 30న ఈ కార్యక్రమం జరిగిందని కూడా వారు పంచుకున్నారు. ప్రకాశవంతంగా వెలుగుతున్న క్లిప్ నిజంగా చూడదగ్గ దృశ్యం.
#WATCH | Gujarat: Devotees in large numbers play Garba in Vadodara Navratri festival VNF on the fifth day of Navratri in Vadodara (30.09)
ఇవి కూడా చదవండి(Video Source: VNF) pic.twitter.com/OJtwbNY5bd
— ANI (@ANI) October 1, 2022
ఈ వీడియోకు 47వేలకు పైగా వ్యూస్, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. ఈ వీడియో చాలా మందిని మంత్రముగ్దులను చేసింది. చిన్న వీడియో నవరాత్రి నిజమైన ఆత్మను చూపిస్తుందని కామెంట్ చేశారు. అంతేకాదు భారతదేశం !! ఇది వేడుకల దేశం. “ప్రపంచం మనల్ని అలా చూడాలని అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.