Viral News: ప్రపంచంలోనే అతి పెద్ద పాముల కలయిక.. ఒకే చోట వేల సంఖ్యలో జతకలిసే చోటు..

Viral News: మన భూగ్రహం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు కేంద్రం. ఎన్నో వైవిధ్యమైన ప్రాణులకు, జీవుల మనుగడకు మన నివసిస్తున్న భూమి ఆధారం. ప్రతీ జీవి తమ తర్వాతి సంతనాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. జీవన మనుగడ ఎంత ముఖ్యమో...

Viral News: ప్రపంచంలోనే అతి పెద్ద పాముల కలయిక.. ఒకే చోట వేల సంఖ్యలో జతకలిసే చోటు..

Updated on: Apr 26, 2022 | 4:32 PM

Viral News: మన భూగ్రహం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు కేంద్రం. ఎన్నో వైవిధ్యమైన ప్రాణులకు, జీవుల మనుగడకు మన నివసిస్తున్న భూమి ఆధారం. ప్రతీ జీవి తమ తర్వాతి సంతనాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. జీవన మనుగడ ఎంత ముఖ్యమో, సంతానాన్ని వృద్ధి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.. దాని కోసమే ఒక్కో జీవి ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంది. ఇలా పాములు కూడా తన సంతానోత్పత్తి కోసం మగపాము, ఆడపాములు కలుస్తుంటాయి. ఇది చాలా సహజమైన విషయం. అయితే కెనడాలోని ఓ ప్రాంతంలో జరిగే పాముల కలయిక, ప్రపంచంలోనే అతి పెద్ద కలయికగా పేరుగాంచింది.

ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది. దాని ప్రాముఖ్యత ఎంటన్న వివరాలు.. కెనడాలోని మానిటోబాలోని నార్సీ స్నేక్‌ డెన్స్‌ అనే ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచలోని పలు దేశాల నుంచి పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. కేవలం ఏప్రిల్‌ చివరి వారం నుంచి మే మధ్య వరకు మాత్రమే పర్యాటకులు వస్తుంటారు. దీనికి కారణం ఆ సమయంలో వేల సంఖ్యలో పాములు ఒకే చోట చేరడం. శీతకాలంలో మగ పాములన్నీ అక్కడి గుహల్లోకి వెళ్లిపోతాయి.

వేసవి మొదలైన తర్వాత పెద్ద సంఖ్యలో పాములు బయటకు వస్తాయి. ఆ సమయానికి బయట పెద్ద సంఖ్యలో ఆడ పాములు కలయిక కోసం ఎదురు చూస్తుంటాయి. ఇలా ఒకేసారి వేల పాములు కలయిక సంబంధించిన దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కలయిక పూర్తయిన తర్వాత ఆడపాములు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్లిపోతాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Vaccine for Children: గుడ్‌న్యూస్.. 6 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం టీకా.. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు DCGI అనుమతి

IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌ కింగ్‌ యుజ్వేంద్ర చాహల్.. టాప్ 3లోకి దూసుకొచ్చిన డ్వేన్‌ బ్రేవో..

Women Health: మగువలకి గమనిక.. ఆరోగ్యకరమై హృదయం కోసం ఏడు జాగ్రత్తలు..!

 

Follow Us