Video: బైక్‌పై భార్య డెడ్‌బాడీ..! అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు..

నాగ్‌పూర్‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 35 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె భర్త ఆమె మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తన స్వస్థలం వైపు తీసుకెళ్లాడు. ఎవరూ సహాయం చేయకపోవడంతో అతను ఈ కష్టకాలంలో కన్నీళ్లతో ప్రయాణం చేయాల్సి వచ్చింది.

Video: బైక్‌పై భార్య డెడ్‌బాడీ..! అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు..
Nagpur News

Updated on: Aug 11, 2025 | 2:20 PM

నాగ్‌పూర్‌లో కన్నీళ్లు పెట్టించే ఓ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్లాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 35 ఏళ్ల ఆ మహిళను వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో డియోలాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్ఫాటా సమీపంలోని నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై ఈ విషాదం జరిగింది. బాధితురాలిని 35 ఏళ్ల గ్యార్సీ అమిత్ యాదవ్‌గా గుర్తించారు. వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

రక్షా బంధన్ జరుపుకోవడానికి ఆమె తన భర్త అమిత్ యాదవ్‌తో కలిసి కొరాడి సమీపంలోని లోనారా నుండి డియోలాపర్ మీదుగా కరణ్‌పూర్‌కు వెళుతోంది. మధ్యప్రదేశ్‌లోని సియోనీకి చెందిన ఈ జంట గత 10 సంవత్సరాలుగా లోనారాలో నివసిస్తున్నారు. ప్రమాదం తర్వాత అమిత్ ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సహాయం కోరాడు. కానీ ఎవరూ సహాయం చేయడానికి లేదా మృతదేహాన్ని తరలించడానికి ఆగి సాయం చేయలేదు. దాంతో చేసేదేం లేక కన్నీళ్లు పెట్టుకుంటూ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనంపై వెనుక కట్టి మధ్యప్రదేశ్‌లోని తన స్వస్థలం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

అతను అలా తీసుకెళ్తున్న సమయంలో చాలా మంది వాహనదారులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ మరింత ఆలస్యం అవుతుందనో లేదా వేరే భయంతో అతను బైక్‌ ఆపకుండా అలానే వెళ్లిపోయాడు. హైవే కొంతమంది వాహనదారులు ఇదంతా వీడియో రికార్డ్ చేశారు. కాగా పోలీసులు అతన్ని అడ్డగించడానికి ప్రయత్నించారు. కొంత దూరం అతన్ని వెంబడించిన తర్వాత, వారు బైక్‌ను ఆపి, మృతదేహాన్ని నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి