Watch Viral Video: చమ్కీల స్కూటర్‌.. రంగు రంగుల లైట్లతో జిగేల్‌ మంటోంది.. చూస్తే కళ్లు చెదిరిపోతాయంతే..

|

Sep 02, 2023 | 4:02 PM

అంతేకాదు.. స్కూటర్‌ ముందు భాగంలో టీవీ కూడా ఏర్పాటు చేశారు. దీని ఆకారం మాత్రం ఇతర స్కూటర్ల మాదిరిగానే ఉంది. కానీ, దాని అలంకరణ ప్రత్యేకించి చేశారు. రంగు రంగుల లైట్లు, చమ్కీలు, అద్దాలు, ముత్యాలు, రంగురాళ్లతో ఎంతో ముద్దుగా ముస్తాబు చేశారు.. నిజంగా చెప్పాలంటే.. అది స్కూటర్ కాదు.. కొత్త పెళ్లి కూతురు అనుకునేలా సరికొత్తగా తీర్చిదిద్దారు.  ప్రస్తుతం ఈ స్కూటర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Watch Viral Video: చమ్కీల స్కూటర్‌.. రంగు రంగుల లైట్లతో జిగేల్‌ మంటోంది.. చూస్తే కళ్లు చెదిరిపోతాయంతే..
Unique Scooter
Follow us on

ఆటోమొబైల్స్, ఆవిష్కరణల యుగంలో ఓ స్కూటర్ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇలాంటి స్కూటర్‌ని ఇంతకు ముందు ఎవరూ చూడలేదనే చెప్పాలి. ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా స్కూటర్‌ని డిజైన్ చేశారు. ఇది సృజనాత్మకతతో నిండి ఉంది. ఇది ముత్యాలు, అందమైన పూసలతో ఎంతో అద్భుతంగా డెకరేట్‌ చేశారు.దీంతో పాటు స్కూటర్‌లో రంగురంగుల లైట్లు కూడా వెలుగుతున్నాయి. అంతేకాదు.. స్కూటర్‌ ముందు భాగంలో టీవీ కూడా ఏర్పాటు చేశారు. దీని ఆకారం మాత్రం ఇతర స్కూటర్ల మాదిరిగానే ఉంది. కానీ, దాని అలంకరణ ప్రత్యేకించి చేశారు. రంగు రంగుల లైట్లు, చమ్కీలు, అద్దాలు, ముత్యాలు, రంగురాళ్లతో ఎంతో ముద్దుగా ముస్తాబు చేశారు.. నిజంగా చెప్పాలంటే.. అది స్కూటర్ కాదు.. కొత్త పెళ్లి కూతురు అనుకునేలా సరికొత్తగా తీర్చిదిద్దారు.  ప్రస్తుతం ఈ స్కూటర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

సల్మాన్ ఖాన్ సినిమా ‘తేరే నామ్’ స్కూటర్ ముందు చిన్న స్క్రీన్‌పై ప్లే అవుతోంది. వైరల్ వీడియో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందినదిగా తెలిసింది. ఇది my_love_jabalpur అనే ఖాతాతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడింది. ఇది ఇప్పటివరకు 19.2 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ఈ వీడియోను వేలాది మంది నెటిజన్లు లైక్ కూడా చేశారు. దీనిపై పెద్ద సంఖ్యలో ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రజలు కామెంట్ సెక్షన్‌లో మీమ్‌లతో హెరెత్తిస్తున్నారు. చాలా మంది ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ అందమైన స్కూటర్‌ వీడియో చూసిన ఒక ఆన్‌లైన్ వినియోగదారుపై వ్యాఖ్యానిస్తూ, బ్రదర్.. ఇందులో ఇంకా చాలా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంది. ప్రొజెక్టర్, నాసా సెక్యూరిటీ ఫంక్షన్, ఇస్రో హార్డ్‌కోర్, వైఫై 6, ఉపగ్రహం, ఇన్వర్టర్, ఐరన్‌ మ్యాన్‌ వంటి అనేకం చెయొచ్చు అన్నారు.

మరొక వినియోగదారు స్పందిస్తూ…మీరు గతంలో ట్రక్ డ్రైవర్‌ అనుకుంటాను అన్నారు. మరో వినియోగదారు,..ఈ స్కూటర్ భారతదేశంలోని బ్యాండ్‌వాగన్ కారుకు చెల్లెలు అంటూ వ్యాఖ్యనించారు. ఇక మరోకరు.. ఇది రణవీర్ సింగ్ స్కూటర్ అంటున్నారు. ఏది ఏమైనా స్కూటర్‌ అద్భుతంగా మెరిసిపోతుందంటూ చాలా మంది ట్విట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..