
మీ పుట్టినరోజు మీ స్నేహితులు, సన్నిహితులు లేదా ఏదైనా ఈవెంట్ కోసం కేక్ ను డిజైన్ చేయించాలనుకుంటే రకరకాల ఆలోచనలు చేస్తారు. అయితే ఒకపట్టాన ఐడియాస్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మీకు ఆ టెన్షన్ ను తగ్గిస్తూ సరికొత్త కేక్ మీ ఇంటి వద్దకే వస్తుంది. ప్రముఖ ఫుడ్ యాప్ జొమాటో ఫోటో కేక్ అనే కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. కేక్‌పై మీ ఫోటో లేదా మీకు నచ్చిన వ్యక్తుల ఫోటో కావాలంటే ముద్రించి ఇస్తుంది. అందుకోసం ఆ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఆ చిత్రంతో కూడిన కేక్ మీకు నచ్చిన బేకరీలో మీ కోసం సిద్ధం చేస్తారు. సాధారణంగా కేక్‌పై ఏదైనా రాయాలంటే ముందుగా బుకింగ్ చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, Zomato మీకు నచ్చిన డిజైన్‌తో కూడిన కేక్‌ను మీకు అందజేస్తుంది.
Zomato ఇప్పటికే ఈ ఫీచర్‌ని అమలు చేసింది. మీ ఫోన్లోని Zomatoలో ఈ ఫీచర్ అందుబాటులో లేకుంటే. యాప్‌ను అప్డేట్ చేయాల్సిందే. ఫోటో కేక్ సర్వీస్ బేకరీల జాబితాలో మీకు కావలసిన దుకాణం నుంచి మీకు నచ్చిన కేక్‌ను పొందవచ్చు. ఇతర ఫుడ్ డెలివరీ మాదిరిగానే ఈ కేక్ తయారీకి సమయం 30 నుంచి 40 నిమిషాలు ఉండవచ్చు. మీరు యాప్‌లోనే కేక్ ఎలా ఉంటుందో ప్రివ్యూ కూడా చూడవచ్చు.
Zomato యాప్‌లోని సెర్చ్ బార్లో ఫోటో కేక్ కోసం వెతకండి
అక్కడ మీకు కేక్ మీద ఫోటో సేవను అందించే బేకరీలు లేదా రెస్టారెంట్ల జాబితా కనిపిస్తుంది.
అప్పుడు కావలసిన దుకాణాన్ని ఎంచుకోండి
అంతేకాదు కేక్ బరువు ఎంత కావాలి, రుచిలో కావాలో ఎంచుకోండి.
తర్వాత కేక్పైకావాలనుకున్న ఫోటోను అప్లోడ్ చేయండి.
అనంతరం ఫోటో కేక్ అక్కడే ఎలా కనిపిస్తుందో ప్రివ్యూ చూడండి.
తర్వాత ఆర్డర్ చేయండి.
ఈ ఫోటో కేక్ మదర్స్ డే కోసం రూపొందించబడింది
మే 12 ప్రపంచ మాతృ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురష్కరించుకుని జొమాటో ఫోటో కేక్ ఫీచర్‌ను విడుదల చేసినట్లు చెబుతోంది. మదర్స్ డే సందర్భంగా, Zomato నుంచి భారీగా కేక్ అమ్మకాలు జరుగుతాయి. గతేడాది మదర్స్ డే సందర్భంగా నిమిషానికి 150 కేకులు అమ్ముడయ్యాయి. ఈసారి మదర్స్ డేకి ఆకర్షణీయమైన ఫీచర్ జోడించడంతో మరిన్ని కేక్‌లు ఆర్డర్ పొందే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నివేదికల ప్రకారం, మే 12 తర్వాత కూడా Zomatoలో ఫోటో కేక్ సర్వీస్ కొనసాగవచ్చని తెలుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..