ఇలా చేస్తే మెట్రో ట్రైన్ టికెట్ ఫ్రీ..

|

Aug 13, 2019 | 1:31 PM

రష్యా ప్రభుత్వం తమ దేశ ప్రజల ఫిట్‌నిస్‌ను దృష్టిలో పెట్టుకుని రాజధాని మాస్కోలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్‌‌లో  ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ యంత్రం ముందు నిలబడి రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే చాలు.. మెట్రోలో ప్రయాణించడానికి ఉచితంగా టికెట్ లభిస్తుంది. రెండు నిమిషాల్లో గుంజీలు తీయలేదా 30 రూబుల్స్‌ను చెల్లించాల్సిందే. క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడానికి రష్యా ఇలాంటి వినూత్న పద్దతిని ప్రవేశపెట్టింది. 2014 వింటర్ ఒలింపిక్స్ సమయంలో వారికి […]

ఇలా చేస్తే మెట్రో ట్రైన్ టికెట్ ఫ్రీ..
Follow us on

రష్యా ప్రభుత్వం తమ దేశ ప్రజల ఫిట్‌నిస్‌ను దృష్టిలో పెట్టుకుని రాజధాని మాస్కోలోని వ్యస్తవోచయ మెట్రో రైల్వే స్టేషన్‌‌లో  ప్రయాణికులు గుంజీలు తీసే ఓ యంత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ యంత్రం ముందు నిలబడి రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీస్తే చాలు.. మెట్రోలో ప్రయాణించడానికి ఉచితంగా టికెట్ లభిస్తుంది. రెండు నిమిషాల్లో గుంజీలు తీయలేదా 30 రూబుల్స్‌ను చెల్లించాల్సిందే. క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడానికి రష్యా ఇలాంటి వినూత్న పద్దతిని ప్రవేశపెట్టింది.

2014 వింటర్ ఒలింపిక్స్ సమయంలో వారికి ఈ ఆలోచన రావడంతో మెట్రో స్టేషన్‌లో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది బాగా పాపులర్ అయింది. దాంతో మెక్సికో నగరంలోని ఓ మెట్రో రైల్వే స్టేషన్‌ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విజయం సాధించింది. అయితే అక్కడ రెండు నిమిషాల్లో 30 గుంజీలు తీయకపోతే పెద్దగా వచ్చే నష్టమేమి ఉండదు. ఎందుకంటే ఆ మెట్రో టికెట్ కాస్ట్ వారి కరెన్సీ కంటే చాలా తక్కువగా ఉంటుంది.