Viral Video: డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

Monkey Funny Video: వానర వేషాలు అన్నీ ఇన్నీకావు..కోతి పేరెత్తితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు...

Viral Video: డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!
Tiger Funny Video (1)

Updated on: May 15, 2021 | 8:10 AM

Monkey Funny Video: వానర వేషాలు అన్నీ ఇన్నీకావు..కోతి పేరెత్తితేనే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది అది వేసే కోతి వేషాలు. వానర చేష్టలు చాలా వరకు విసుగు తెప్పించినా, కొన్నిసార్లు మాత్రం నవ్వుపుట్టిస్తాయి. కానీ, ఇక్కడో కోతి మాత్రం..ఏకంగా ఒకేసారి నాలుగైదు పులుల గుంపును ఆటాడిస్తోంది..

పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పులి కనుసన్నల్లో నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు. ఒకసారి టార్గెట్‌ చేసిందంటే వార్‌ వన్‌సైడ్‌ అవ్వాల్సిందే. కానీ, ఇక్కడ ఒకటి కాదు..ఏకంగా పులుల గుంపునే ముప్పుతిప్పలు పెట్టిస్తోంది ఈ కోతి.. కోతి నాలుగు కాళ్లతో ఆడుతూ ఆ పులులను ఊరిస్తోంది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ…మరీ కోతి వెర్రీ కాకపోతే…ఇంతలా ఉడికించాలా..?అని కొంతమంది అంటుండగా, ఈ కోతి అదృష్టం బాగుంది..అందుకే పులులకు చిక్కకుండా తప్పించుకుంది. దీని ఆయుష్యు గట్టిదే అంటూ మరికొంత మంది కామెంట్‌ చేస్తున్నారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

Loading...
Unable to load recommendations.
Follow Us