Viral Video: స్నేహమంటే ఇదేరా.. దొంగతనంలో కోతికి సాయం చేసిన కుక్క.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబందించినవి.

Viral Video: స్నేహమంటే ఇదేరా.. దొంగతనంలో కోతికి సాయం చేసిన కుక్క.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే
Monkey And Dog

Updated on: May 20, 2022 | 7:40 AM

Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబందించినవి. జంతువుల వీడియోల్లో..కొన్ని భయపెట్టివిగా ఉంటాయి. అలాగే మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. మరికొన్ని వీడియోల్లో జంతువుల స్నేహం మనసుకు హత్తుకుంటూ ఉంటాయి. స్నేహం అనేది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా ఎక్కువే..  తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక కోతి చేసిన పనికి ఓ కుక్క సాయం చేసింది.

కోతులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఇళ్లలోని తినుబండారాలను.. షాపుల్లోని పండ్లను దోగిలిస్తూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కోతి షాప్ లో దొంగతనానికి ప్లాన్ చేసింది. చిప్స్ ప్యాకెట్‌ను దొంగిలించడానికి ప్లాన్ చేసుకుంది. అయితే ఆ కోతికి ఓ కుక్క సాయం చేసింది. షాపులో చిప్స్ ప్యాకెట్‌ను దొంగిలించడానికి ట్రై చేసింది పొడవు తక్కువగా ఉండటంతో ప్యాకెట్‌కు చేతికి అందలేదు. అయితే కోతి వెంటనే దొంగతనం చేయడానికి వచ్చిన కుక్క పై నిలబడి చిప్స్ ప్యాకెట్ ను దొంగిలించింది. ఈ దొంగతనంలో కోతి సక్సెస్ కాకపోయినా అది చేసిన పని దానికి సాయం చేసిన కుక్కను చూసి నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు.ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో memes.bks అనే పేజీలో కూడా అప్‌లోడ్ చేయబడింది. దీనికి కొందరు.. ఈ వీడియో  చూసిన తర్వాత నా మిత్రుడు గుర్తొచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anasuya Bharadwaj: నయా అందాలతో ఆకట్టుకుంటున్న అను లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Priyamani: ఆరెంజ్ డ్రెస్ లో మతిపోగుడుతున్న ప్రియమణి.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Deepika Padukone: కొర చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us