Viral Video: ఉప్పొంగిన అభిమానం.. ఫోక్‌ సింగర్‌పై కరెన్సీ నోట్ల వర్షం.. ఏకంగా బకెట్లతో

చప్పట్లే.. కళాకారులకు అసలైన పంచభక్ష పరమాన్నాలు అంటారు. ఈ విషయం నిజమే అయినా.. చప్పట్లు ఆకలిని తీర్చవన్నది అందరికీ తెలిసిన విషయమే.

Viral Video: ఉప్పొంగిన అభిమానం.. ఫోక్‌ సింగర్‌పై కరెన్సీ నోట్ల వర్షం.. ఏకంగా బకెట్లతో
Viral News

Updated on: Nov 22, 2021 | 5:55 PM

చప్పట్లే.. కళాకారులకు అసలైన పంచభక్ష పరమాన్నాలు అంటారు. ఈ విషయం నిజమే అయినా.. చప్పట్లు ఆకలిని తీర్చవన్నది అందరికీ తెలిసిన విషయమే. వారికి కూడా బ్రతకడానికి డబ్బులు కావాలి. కాగా నాటకాలు జరుగుతుండగా.. గుక్కతిప్పుకోకుండా పద్యాలు చెప్పినవారిని, అద్భుతమైన నటనా కౌశల్యం ప్రదర్శించినవారిని  ప్రశంసించేందుకు వారికి కరెన్సీ నోట్లు ఇవ్వడం గ్రామాల్లో చూస్తూనే ఉంటాం. ఇక పబ్‌ల్లో, క్లబ్బులో నృత్యాలు చేసేవారికి భారీగా డబ్బులు ఇవ్వడం మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే కళాకారులపై బకెట్ల కొద్దీ డబ్బులు గుమ్మరించిన ఘటనలు మీరు ఎప్పుడైనా చూశారా..?. తాజాగా అలాంటి ఘటన జరిగింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఊర్వశి రాధాదియా అనే గుజరాతి జానపద గాయని ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొంది. గుజరాత్‌కు చెందిన శ్రీ సమస్త్‌ హరిద్వార్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె సంగీత కచేరీ ఇచ్చింది.

ఊర్వశి తన గాత్రంతో అక్కడికి వచ్చినవారికి మంత్రముగ్ధుల్ని చేసింది. కిర్రాకైన పాటలతో మెస్మరైజ్ చేసింది. దీంతో వారంతా ఫిదా అయిపోయారు. ఆమెపై కరెన్సీ నోట్ల వర్షాన్ని కురిపించారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా ఒక బకెట్ నిండా డబ్బులు  తీసుకొచ్చి.. ఆమెపై పోశాడు. తనపై ఉప్పొంగిన అభిమానానికి సంబంధించిన వీడియోను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.  ఆమె పాటలు పాడుతున్నంతసేపు ఈ కరెన్సీ వర్షం కొనసాగింది. ఈ వీడియోకు ఓ రేంజ్‌లో లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు  తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Viral Video: కారులో వచ్చిన ఈ ఆంటీలు ఏం దొంగతనం చేశారో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్..

AP Floods: వరదల్లో డ్యామేజ్‌ అయిన ఇళ్లకు కూడా పరిహారం.. ఏపీ మంత్రి ప్రకటన