చిన్నారి హెయిర్‌ కట్టింగ్‌ కోసం స్మార్ట్‌ ఐడియా.. అమ్మా.. ఏం చేస్తున్నావ్‌.. అంటూ బుడ్డొడి పరేషాన్ చూడాలి..

|

Jun 30, 2023 | 3:17 PM

చిన్న పిల్లలకు జుట్టు కత్తిరించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. పిల్లలు ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోలేరు. అటు ఇటూ కదులుతూనే ఉంటారు. కొందరు కట్టింగ్‌ మొదలు పెట్టకముందే.. ఏడుపు మొదలుపెట్టేస్తారు. కన్నీళ్లు వరదలయ్యేలా ఏడుస్తుంటారు. కానీ, బార్బర్‌ ముందు అస్సలు కదలకుండా కూర్చోలేరు. అందుకే ఈ అమ్మ కొత్త ఐడియాతో హెయిర్‌ కట్టింగ్‌ చేసింది.

చిన్నారి హెయిర్‌ కట్టింగ్‌ కోసం స్మార్ట్‌ ఐడియా.. అమ్మా..  ఏం చేస్తున్నావ్‌.. అంటూ బుడ్డొడి పరేషాన్ చూడాలి..
Hair Cutting
Follow us on

చిన్న పిల్లలను ఒక్కచోట పట్టి ఉంచటం చాలా కష్టం. ముఖ్యంగా చేతులపై పాకుతూ, అప్పుడప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్నారులను హ్యాండిల్ చేయడం మరింత కష్టంతో కూడుకున్న పని. కన్ను మూసి తెరిచే లోపుగానే ఏదో ఒక పని చేసేస్తుంటారు. ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరో ఒకరు ఎప్పుడూ వారి వెంటే ఉండాల్సి వస్తుంది. చిన్న పిల్లలు చోట నిలబడలేరు, కూర్చోలేరు. అలాగే పిల్లల గోళ్లు తీయడం, తినిపించడం, జుట్టు దువ్వడం, కత్తిరించడం మొదలైన ప్రతి పనిని చాలా సున్నితంగా చేయాల్సి ఉంటుంది. లేదంటే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న హాని కలిగే ప్రమాదం ఉంటుంది. చాలా సందర్బాల్లో పిల్లలకు హెయిర్‌ కట్టింగ్‌.. చేయించటం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్‌ అనే చెప్పాలి. వారిని ఏడిపించకుండా, ఏ మాత్రం హాని కలగించకుండా హెయిర్‌ స్టైల్‌ చేయించేందుకు గానూ ప్రతి తల్లిదండ్రులు స్మార్ట్‌గా ఆలోచిస్తుంటారు.. ఇలాంటిదే ఇక్కడ కూడా ఓ తల్లి తన చిన్నారికి హెయిర్‌ కట్టింగ్‌ చేసేందుకు గానూ భలే ప్లాన్‌ చేసింది. ఇక్కడ ఈ అమ్మ ఆలోచన బెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది.

తల్లి చేసే ప్రతి ఆలోచనలో శిశువు భద్రత ప్రధానంగా ఉంటుంది. పిల్లల విషయంలో తల్లి తీసుకునే కేర్‌ ఇంకేవరూ చూపించలేరు. సాధారణంగా చిన్న పిల్లలకు జుట్టు కత్తిరించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. పిల్లలు ఒక్క క్షణం కూడా కుదురుగా కూర్చోలేరు. అటు ఇటూ కదులుతూనే ఉంటారు. కొందరు కట్టింగ్‌ మొదలు పెట్టకముందే.. ఏడుపు మొదలుపెట్టేస్తారు. కన్నీళ్లు వరదలయ్యేలా ఏడుస్తుంటారు. కానీ, బార్బర్‌ ముందు అస్సలు కదలకుండా కూర్చోలేరు. అందుకే ఈ అమ్మ కొత్త ఐడియాతో హెయిర్‌ కట్టింగ్‌ చేసింది. చిన్నారికి వెంట్రుకలను కత్తిరించడం ప్రారంభించేముందు.. ఆ శిశువును అట్ట పెట్టెలో కూర్చుండబెట్టింది. ఆ పెట్టెకు రెండు రంధ్రాలు చేసి బిడ్డ కూర్చోవడానికి వెసులుబాటు కల్పించింది. అలాగే తల మాత్రమే బయటకు వచ్చేలా అట్ట పెట్టెను కత్తిరించింది. ఆ చిన్నారి చేతులను కార్డ్‌బోర్డ్‌లోనే ఉండేలా గమ్ టేమ్‌తో పెట్టెకు అతికించింది. తరువాత, ఆమె హెయిర్ ట్రిమ్మర్‌తో ఆ శిశువు జుట్టును చక్కగా కత్తిరించింది. తల్లి ఏం చేస్తుందో తెలియని ఆ చిన్నారి కళ్లు పెద్దవి చేసి చూస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపన్ శర్మ స్మైలీ ఎమోజీతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీడియో చూసిన చాలా మంది ఆ తల్లి తెలివికి హాట్సాఫ్ అంటున్నారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించగా అమ్మ చాలా తెలివైనదని పలువురు వ్యాఖ్యానించారు. ఇది వినూత్నమైన ఆలోచన అని, శిశువు పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుందంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..