Watch Video: ఇలా ఉన్నావేంట్రా అయ్యా.. గుడిలోకి వచ్చిన ఉగ్రవాదిని పట్టుకుని చెంపలు వాయించిన కుర్రాడు.. స్టన్నింగ్ వీడియో..

|

Aug 09, 2023 | 8:56 AM

టెర్రరిస్టులు అటాక్ చేస్తే ఎవరైనా ఏం చేస్తారు.. గమ్మున ఉండిపోతారు. కానీ ఓ యువకుడు తిరగబడి వారిని కొట్టేశాడు. ధూలే నగరంలోని దేవ్‌పూర్‌లోని శ్రీ స్వామినారాయణ ఆలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన వైరల్‌గా మారింది. ఆ టెర్రరిస్టులను కొట్టడం.. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది.

Watch Video: ఇలా ఉన్నావేంట్రా అయ్యా.. గుడిలోకి వచ్చిన ఉగ్రవాదిని పట్టుకుని చెంపలు వాయించిన కుర్రాడు.. స్టన్నింగ్ వీడియో..
Man Beatens Terrorist
Follow us on

అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి.. టెర్రరిస్టులు అటాక్ చేస్తే ఎవరైన గమ్మున దాక్కుంటారు.. అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకుంటారు. కిమ్మనకుండా ఉండిపోతారు. అలాంది ఓ యువకుడు వారిపైకి తిరగబడ్డాయి. ఏకే 47తో ఉన్న టెర్రరిస్టుపైకి తిరిగబడ్డాడు. చేతు విరిచి కొట్టేశాడు. మహారాష్ట్రలోని ధూలేలో జరిగిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇక్కడ ఆలయంలో పోలీసులు చేసిన మాక్ డ్రిల్.. నిజానికి డమ్మీ ఉగ్రవాదులు నోటికి గుడ్డ, చేతిలో ఏకే 47తో ఆలయంలోకి ప్రవేశించారు. ఈ దృశ్యాన్ని చూసిన ఆలయంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిల్లలు భయంతో కేకలు వేశారు. దీంతో కోపోద్రిక్తుడైన ఓ యువకుడు డమ్మీ టెర్రరిస్ట్ అంటే పోలీస్‌ని చెంపదెబ్బ కొట్టాడు. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఆగస్టు 6 సాయంత్రం జరిగింది.

ఆలయంలో ఉగ్రదాడి జరిగితే.. అనే టాపిక్‌పై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా.. ఆ సమయంలో చిన్నారులతో పాటు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. తుపాకీలతో ఉన్న డమ్మీ టెర్రరిస్టును, బందీగా ఉన్న ఓ పౌరుడిని చూసి ఆలయంలో సందడి నెలకొంది. వీటన్నింటి మధ్య కోపంతో ఉన్న ప్రశాంత్ కులకర్ణి అనే పిల్లవాడి తండ్రి వచ్చి తన చేతిలో తుపాకీతో డమ్మీ టెర్రరిస్ట్‌ని చెంపదెబ్బ కొట్టాడు. అంతటితో ఆగకుండా టెర్రరిస్టు చేతిని పట్టకుని తిప్పేశాడు.. ఇదంతా గమనిస్తున్న పోలీసులు అక్కడి చేరుకుని ఇది మాక్ డ్రిల్ అని చెప్పడంతో ఆ యువకుడు కూల్ అయ్యాడు.

ఆగ్రహించిన యువకుడు డమ్మీ ఉగ్రవాదిని చెంపదెబ్బ..

ధూలే నగరంలోని దేవ్‌పూర్‌లోని శ్రీ స్వామినారాయణ ఆలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో ధూలే పౌరులు మాక్ డ్రిల్‌ను ఆస్వాదించారు. అయితే, ఆలయంలో ఉన్న పిల్లలు మరియు మహిళలు భయపడి ఏడవడం ప్రారంభించడంతో ఒక పౌరుడికి కోపం వచ్చింది. డమ్మీ టెర్రరిస్టుపై దాడికి దిగి రెండుసార్లు చెంపదెబ్బ కొట్టాడు. అధికారులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు

అది మాక్ డ్రిల్ అని యువకుడికి చెప్పడంతో.. ఏదైనా ఉగ్రవాద ఘటన జరిగినప్పుడు సామాన్య పౌరులను రక్షించేందుకు కసరత్తు చేశారు. ఆ తర్వాత యువకుడి కోపం తగ్గిపోయింది. మరోవైపు, పోలీసుల ఈ విన్యాసానికి అందరూ చాలా భయపడ్డారని.. అందులోనూ తన కొడుకు మరింత భయంతో వణికిపోయాడని ఆ యువకుడు చెప్పాడు. తమ కొడుకు ఏడవడం తాను తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చాడు. ముందుగా తమకు ఇది మాక్ డ్రిల్ అని తెలియదని వెల్లడిచాడు.

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

ఆలయంలో పోలీసులు మాక్ డ్రిల్

గుడిలో పోలీసులు అకస్మాత్తుగా మాక్ డ్రిల్ చేయడం, ఆపై చెంపదెబ్బలు కొట్టడం వల్ల ఆలయంలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి.. ధూలే పోలీసులు, స్థానిక పరిపాలనతో కలిసి నగరంలోని స్వామి నారాయణ దేవాలయంలోని క్యాంటీన్‌లో మాక్ డ్రిల్ నిర్వహించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం