
జనవరి 2025లో జో వాలిడెమ్ కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ద్వీపంలో ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాడు. అతను తన కుక్క తీసుకుని వాకింగ్ కోసం వెళ్ళినప్పుడు గంటకు 60,000 కిలోమీటర్ల వేగంతో ఒక ఉల్క నేలపై పడింది. ఈ సంఘటన అతని ఇంటి డోర్‌బెల్ కెమెరాలో రికార్డైంది. ఇది మొదటిసారి ఉల్క శబ్దంతో సహా క్యాప్చర్ చేయబడింది. పెర్సీడ్ ఉల్కాపాతం సమయంలో ప్రతి సంవత్సరం ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కానీ, వాటిని కెమెరాలో బంధించడం చాలా అరుదు.
ఉల్కలు అంటే ఏమిటి, ఎన్ని పడతాయి?
ఉల్కలు అంటే అంతరిక్షం నుండి వచ్చి భూమిపై పడే రాతి లేదా లోహపు ముక్కలు. ప్రతిరోజూ దాదాపు 44,000 కిలోల ఉల్క పదార్థం భూమి వైపు వస్తుంది. వాటిలో ఎక్కువ భాగం వాతావరణంలో కాలిపోతాయి. కానీ, కొన్ని ముక్కలు భూమిని చేరుతాయి. నాసా ప్రకారం, ప్రతిరోజూ 48 టన్నుల శిథిలాలు భూమిపై పడతాయి. కానీ అవి నేలపై పడి నమోదు కావడం ఒక ప్రత్యేక విషయం.
ఉల్కల వల్ల ప్రమాదం ఉందా?
ఉల్క వల్ల మానవుడు చనిపోయే ప్రమాదం చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రొఫెసర్ క్యారీ నుజెంట్ ప్రకారం 140 మీటర్ల కంటే పెద్ద గ్రహశకలం ఢీకొనే అవకాశాలు పిడుగుపాటు వల్ల చనిపోయే అవకాశాలు కంటే ఎక్కువగా ఉండవచ్చు. కానీ, ఈ సంఘటనలు చాలా అరుదు. ఉదాహరణకు, ఉల్క ఢీకొనే ప్రమాదం ఏనుగు లేదా అడవి తోడేలు దాడి కంటే తక్కువ.
చరిత్రలో ఉల్క కారణంగా ఒకే ఒక మరణం నిర్ధారించబడింది. 1888లో ఇరాక్‌లో ఒక వ్యక్తి ఉల్క కారణంగా మరణించాడని ఒట్టోమన్ సామ్రాజ్యం నివేదించింది. 1954లో అమెరికాలోని అలబామాలో ఒక మహిళపై ఒక ఉల్క పడింది. కానీ, ఆమె ప్రాణాలతో బయటపడింది. కానీ, ఆమె శరీరంపై పెద్ద మచ్చ ఏర్పడింది. ఇటువంటి సంఘటనలు చాలా అరుదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..