AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వారెవ్వా.. ఏం కొడుతున్నావ్ అక్క! మేస్త్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా..

మహిళలు సాధారణంగా చేయని సుతారి పనిని ఎంతో నిబద్ధతతో చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది సవిత. ఆమె చేసే పనిలో నుండి వచ్చే ప్రత్యేకమైన రిథమ్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్ సిల్వర్ బటన్ పొందిన సవిత, తన పనిని ప్రేమగా చేసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

Video: వారెవ్వా.. ఏం కొడుతున్నావ్ అక్క! మేస్త్రీ పనితో మ్యూజిక్ క్రియేట్ చేశావ్‌గా..
Female Mason Viral Video
SN Pasha
|

Updated on: Jul 17, 2026 | 4:53 PM

Share

సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. డ్యాన్స్, పాటలు, ఫైట్లు, కామెడీ, క్రైమ్ ఇలా పలు రకాల వీడియోలు, రీల్స్ నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఆమె డ్యాన్సర్ కాదు, సింగర్ కాదు.. సుతారి పని చేసే మేస్త్రీ. సాధారణంగా అయితే సుతారీ మేస్త్రీలు మగవారే ఎక్కువగా ఉంటారు. మహిళలు ఆ పనికి వెళ్లినా హెల్పర్లుగానే పనిచేస్తారు. కానీ, ఈమె కాస్త డిఫరెంట్.. బొచ్చలో మాల్ వేసుకొని.. తాపీతో ఇంటి పైకప్పుకు ప్లాస్టింగ్ రఫ్పాడించేసింది. ఆమె సుతారి పని చేస్తున్న వీడియోలో ఆమె స్పీడ్ ఒక్కటే హైలెట్ కాదు.

సరిగ్గా గమనిస్తే.. ఆమె పని చేస్తున్న ఫ్లోలో ఒక రిథమ్‌లో సౌండ్ వస్తుంది. దాన్ని బీజీఎంలా వాడుకోవచ్చు అని కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్ కూడా చేస్తున్నారు. ఏ తమన్ అన్నకో, లేదా అనిరుద్ధ్‌కో ఈ వీడియో కంట పడితే.. వాళ్లు ఈ సౌండ్‌ను అదిరిపోయే బీజీఎంగా మార్చేస్తారని అంటున్నారు. నిజంగానే కాస్త స్పీడ్‌లో ఆ సౌండ్ వింటే.. పనిచేస్తున్నప్పుడు వచ్చే సౌండ్‌లా లేదు. ఎవరో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్‌తో మ్యూజిక్ వాయిస్తున్నట్లే ఉంది. కావాలంటే మీరు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ వీడియోను 2ఎక్స్ స్పీడ్‌లో వినండి.. మీకు కూడా మ్యూజిక్‌లా వినిపిస్తోంది.

వీడియో చూడండి

ఇంతకీ ఆ మేస్త్రీ అక్క ఎవరో తెలుసా.. ఆమె పేరు సవిత. చేసేది సుతారి పనే అయినా పని చేస్తున్నప్పుడు వీడియోలు తీసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఉంటుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమెకు సోషల్ మీడియాలో ఏకంగా 6 లక్షల పైనే ఫాలోవర్లు ఉన్నారు. అలాగే యూట్యూబ్ నుంచి ఆమెకు సిల్వర్ బటన్ కూడా వచ్చింది. అయినా కూడా సుతారి పని వదలకుండా చేసుకుంటూ లైఫ్‌ని సంతోషంగా లీడ్ చేస్తోంది. అంత కష్టమైన పనిని హ్యాపీగా చేయడమే కాకుండా.. మగవారికి పోటీ ఇచ్చేలా అంత వేగంగా చేయడం గ్రేట్ అంటూ నెటిజన్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో సంచలనం..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
వాట్సాప్‌లో బెస్ట్ ఫీచర్.. రెండు ఫోన్‌ కెమెరాలు ఒకేసారి..!
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడని ఆహారాలు ఏంటో తెలుసా..?
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
బిల్లుపై పోరుకు కాంగ్రెస్ రెడీ.. మధ్యలో ట్విస్ట్ ఇచ్చిన మిత్రులు!
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
కార్తీక శనివారం వేంకటేశ్వర స్వామి పూజ.. ఇంట్లోనే ఇలా పూజిస్తే..
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
బంగారంపై రుణం తీసుకున్న వారికి బ్యాంకుల నుంచి నోటీసులు.. ఎందుకంటే
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
జియో, ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ బిగ్ షాక్.. ఇకపై లెక్క మారాల్సిందేనా ?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
Hyundai Ioniq Pతో Tata Nexon మార్కెట్​ తగ్గుతుందా?
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..
జనవరి నుంచే జలగండం..? జలాశయాల్లో జీరో లెవల్స్.. హైదరాబాద్ అంతటా..