మాంసం ప్రియులకు హెచ్చరిక.. ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ.. మర్చిపోతే జరిమానా!..పూర్తి వివరాలు

మనలో చాలా మంది నాన్‌వెజ్‌ ప్రియులుంటారు. వీళ్లకు ప్రతి రోజూ భోజనంలో ముక్కలేనిదే ముద్ద దిగదు. చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు ఇలా అన్ని రకాల మాంసాహారాలను ప్రజలు ఇష్టంగా లాగించేస్తుంటారు. అయితే, భారత ప్రభుత్వం కొన్ని నగరాల్లో మాంసాహారం తినడం విషయంలో కఠినమైన నియమాలను రూపొందించింది. వీటిని తప్పనిసరిగా పాటించాలి. ఇది మాత్రమే కాదు, ఈ నగరాల్లో మాంసం తినడం, అమ్మడం నేరంగా పరిగణించబడుతుంది. మీరు ఈ నగరాల్లో దేనినైనా సందర్శించబోతున్నట్లయితే, ముందుగా మీరు అక్కడి నియమాలను తప్పక తెలుసుకుని ఉండాలి.. భారతదేశంలోని ఈ నగరంలో మాంసం పూర్తిగా నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా శాఖాహారం మాత్రమే లభించే ఏకైక నగరం ఇదే. అది ఎక్కడో పూర్తివివరాల్లోకి వెళితే..

మాంసం ప్రియులకు హెచ్చరిక.. ఇక్కడ నాన్‌వెజ్‌కు నో ఎంట్రీ.. మర్చిపోతే జరిమానా!..పూర్తి వివరాలు
Non Vegetarian Food Ban

Updated on: Feb 11, 2026 | 4:02 PM

సాధారణంగా మాంసం కొందరికి నచ్చకపోయినా అందరూ ఇష్టపడతారు. వారానికి కనీసం ఒక రోజు నాన్‌వెజ్‌ తింటే సరిపోతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుత కాలంలో శాఖాహారులు కూడా మాంసానికి బానిసలవుతున్నారు. అలాగే, మరికొందరు ఏ వివాహ వేడుక, విందులో మాంసం తింటే సరిపోతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. మాంసం ఉంటేనే విందుకు వస్తామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ, మన దేశంలో మాంసం వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన ఒకే ఒక్క నగరం ఉంది. ఈ నగరం ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచంలోనే మాంసాహార ఉత్పత్తులు, పదార్థాల అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన మొట్టమొదటి నగరంగా గుజరాత్‌లోని పాలిటానా చరిత్ర సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా, మాంసాహార వినియోగం, అమ్మకాలను పూర్తిగా నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం. ఈ క్రమంలోనే మాంసాహార దుకాణాలు కూడా మూసివేయబడ్డాయి. ఎవరూ గుడ్లు లేదా మాంసం అమ్మకూడదు. ప్రపంచంలోని అతి ముఖ్యమైన జైన యాత్రా స్థలాలలో ఒకటైన పాలిటానాలోని జైనుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మత విశ్వాసాల కారణంగానే కాకుండా నగరం గుర్తింపు, ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికి కూడా ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారు.

ఈ నగరం జైనులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ వందలాది దేవాలయాలు కూడా ఉన్నాయి. అందువల్ల, మాంసాహారంపై నిషేధం మత విశ్వాసాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది శాఖాహార జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. ఇది జైన సమాజం ప్రధాన నమ్మకం. జైన మతంలో అహింస చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలోనే పాలిటానా మాంసాహార ఆహారాన్ని పూర్తిగా నిషేధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..