Watch Video: రోడ్డుపై ట్రాఫిక్ జాం.. అంతలోనే దూసుకొచ్చిన మృత్యువు

నాగాలాండ్‌లోని చమౌకేదిమా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి అకస్మాత్తుగా మూడు కార్లపైకి దూసుకురావడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా. మరొకరు హస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు.

Watch Video: రోడ్డుపై ట్రాఫిక్ జాం.. అంతలోనే దూసుకొచ్చిన మృత్యువు
Massive Rock

Updated on: Jul 05, 2023 | 9:05 AM

నాగాలాండ్‌లోని చమౌకేదిమా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఓ పెద్ద బండరాయి అకస్మాత్తుగా మూడు కార్లపైకి దూసుకురావడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయా. మరొకరు హస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మరో మగ్గురి పరిస్థితి విషాదంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే నాగలాండ్ రాజధాని అయిన కొహిమా నుంచి దిమాపుర్ వైపు వెళ్లే జాతీయ రహదారి రూట్‌లో ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో వాహనాలన్ని ఆ రోడ్డుపైనే ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. ఈ రోడ్డు పక్కనే ఓ ఎత్తైన కొండ ఉంది. ఆ సమయంలో ఆ కొండపై నుంచి కొండచరియలు విరిగిపోయాయి.

అనంతరం ఓ పెద్ద బండరాయి రోడ్డుపై పక్కపక్కనే నిల్చున్న రెండు కార్లపై దూసుకెళ్లింది. మరో బండరాయి వాటి ముందున్న ఓ కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. పెద్ద బండరాయి మొదటగా ఢీకొన్న కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటెజ్‌లో రికార్డు కావడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంపై నాగలాండ్ సీఎం నెఫ్యూ రియో కూడా స్పందించి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం