Viral Video: మీ ఐడియాలకు సలాం చెయ్యాల్సిందేరయ్య.! కుక్కర్ ను ఇలా కూడా వాడొచ్చా..!!

కొందరు చేసే ప్రత్యేకమైన జుగాడ్‌లను ప్రదర్శించే వీడియోలు కూడా అప్పుడప్పు హల్‌చల్‌ చేస్తుంటాయి. ఇటువంటి వీడియోలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రజలు వాటిని మెచ్చుకోకుండా ఉండలేరు. మరికొన్ని కడుపుబ్బ నవ్వుకునేలా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇటీవల, అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ, దీని గురించి కూడా ఆలోచించేలా చేసింది. అదేంటంటే..

Viral Video: మీ ఐడియాలకు సలాం చెయ్యాల్సిందేరయ్య.! కుక్కర్ ను ఇలా కూడా వాడొచ్చా..!!
Cooker To Inflate Bicycle Tire

Updated on: Oct 25, 2025 | 6:05 PM

సోషల్ మీడియా అనేది ఫన్నీ, షాకింగ్‌ వీడియోల సమాహారం.. ఇక్కడ ప్రతిరోజూ వందల వేల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొందరు కంటెంట్‌ క్రియేటర్లు తమను తాము ఫేమస్‌ చేసుకోవటం కోసం రాత్రికి రాత్రే ప్రజల్లో పబ్లిసిటీ సంపాదించటం కోసం ఇక్కడ వివిధ వీడియోలు, ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. వీటన్నింటి మధ్య, మరికొందరు చేసే ప్రత్యేకమైన జుగాడ్‌లను ప్రదర్శించే వీడియోలు కూడా అప్పుడప్పు హల్‌చల్‌ చేస్తుంటాయి. ఇటువంటి వీడియోలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రజలు వాటిని మెచ్చుకోకుండా ఉండలేరు. మరికొన్ని కడుపుబ్బ నవ్వుకునేలా ఉంటాయి. కొన్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఇటీవల, అలాంటి ఒక ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ, దీని గురించి కూడా ఆలోచించేలా చేసింది. అదేంటంటే..

ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ప్రెజర్‌ కుక్కర్‌ను గ్యాస్‌ స్టవ్‌పై ఉంచాడు. లోపల ఏం వండుతున్నారో ఎవరికీ తెలియదు. కానీ, అందరి దృష్టిని ఆకర్షించేది కుక్కర్‌తో అతడు చేసిన ట్రిక్‌ . ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ప్రెషర్ కుక్కర్ విజిల్ స్థానంలో మరొక చివర సైకిల్ టైర్‌కు కనెక్ట్ అయ్యేలా పైపును అమర్చారు.. దీంతో సైకిల్‌లోకి గాలిని నింపడానికి ప్రెషర్ కుక్కర్ నుండి ఆవిరిని ఉపయోగిస్తున్నారు..ఈ అసాధారణ ట్రిక్ చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియోను @Faruk_pathan01 అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిని ఇప్పటికే 40,000 కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ వీడియోకు చాలా మంది ఫన్నీ రియాక్షన్స్‌ ఇచ్చారు. దీనిని జుగాద్ టెక్నాలజీ అంటారు.. మనకు ఇందులో పోటీ లేదు అంటూ ఒకరు రాయగా, మరొకరు సరదాగా, కుక్కర్ పేలిపోతుందని లేదంటే..టైర్ పగిలిపోతుందని రాశారు. బ్రదర్‌ మీ ట్రిక్‌ అద్భుతంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా మీలాంటి క్రియేటివిటీ కనిపించదని అంటూ ఎద్దేవా చేస్తూ రాశారు. మొత్తానికి వీడియో మాత్రం ఇంటర్‌నెట్‌ను షేక్‌ అయ్యేలా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..