ఎప్పుడైన ఆసుపత్రికి వెళ్లినప్పుడు రోగులను పై అంతస్తులకు తీసుకెళ్లేందుకు సాధారణంగా వీల్ చైర్లు ఉంటాయి. కాని రాజస్థాన్‌లో ఓ ఆసుపత్రిలో వీల్ చైర్లు లేకపోవడంతో ఓ తండ్రి తన కొడుకును పై అంతస్తుకి స్కూటీపై తీసుకెళ్లడం అందర్ని ఆశ్యర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే కోట జిల్లాలోని ఓ తండ్రి ఇటీవల తన కుమారుడి కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో.. కట్లు మార్పించేందుకు ఆస్పత్రికి వచ్చాడు. కానీ ఆ ఆసుపత్రిలో సరిపడా వీల్ చైర్లు అందుబాటులో లేవు. దీంతో ఆ తండ్రి ఆసుపత్రి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకొని స్కూటర్‌ను తెప్పించుకున్నాడు. ఆ స్కూటర్‌పై తన కొడుకుని ఎక్కించుకుని లిఫ్ట్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మూడవ ఫ్లోర్‌కి వెళ్లాడు.
సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆ ఆసుపత్రి చేరుకున్నారు. అయినప్పటికీ ఆ తండ్రి చేసిన పనికి మద్దతు తెలిపారు. ఆ ఆసుపత్రిలో వీల్ చైర్ల కొరత ఉండటంతో త్వరలోనే మరిన్ని వీల్‌చైర్లను అందుబాటులోకి తీసుకొస్తామని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
#Rajasthan: Shocking video surfaced from Kota’s hospital. The lawyer climbed to the third floor by scooty. #Viralvideo #India pic.twitter.com/qZ4l9zzovV
— Akshara (@Akshara117) June 17, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..