Viral Video: రెండు భారీ కొండ చిలువలు.. మధ్యలో ఒక వ్యక్తి.. వీడియో చూస్తే గుండెలు అదరాల్సిందే

|

Nov 10, 2022 | 5:04 PM

పాములంటే ఏమాత్రం భయపడకుండా వాటిని పట్టుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పాములైతే ఓకే కానీ ఏకంగా భారీ కొండచిలువలను, అనకొండలు పట్టుకోవడం.

Viral Video: రెండు భారీ కొండ చిలువలు.. మధ్యలో ఒక వ్యక్తి.. వీడియో చూస్తే గుండెలు అదరాల్సిందే
Python
Follow us on

పాములంటే చాలా మంది వణికిపోతారు.. కలలో కనిపిస్తే భయంతో జ్వరం తెచ్చుకుంటారు కొందరు. మరికొంతమందైతే వాటిని స్నేహితుల్లా  ట్రీట్ చేస్తుంటారు. పాములంటే ఏమాత్రం భయపడకుండా వాటిని పట్టుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పాములైతే ఓకే.. కానీ ఏకంగా భారీ కొండచిలువలను, అనకొండలు పట్టుకోవడం. వాటితో సన్నిహితంగా ఉండటం అంటే మాములు విషయం కాదు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియో చూస్తే వణికిపోవాల్సిందే. ఈ వీడియోలో రెండు భయంకరమైన భారీ కొండ చిలువలను చూడొచ్చు..

ఒక వ్యక్తి తన ఒడిలో కొండచిలువను ప్రేమగా కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ కొండచిలువ నోటిని పట్టుకున్నాడు. ఈ వీడియో చూస్తే ఎవరికైనా వణుకుపుడుతుంది. అయితే ఆ పాముల తలుచుకుంటే క్షణంలో మిగేస్తాయి కానీ అవి అలా చేయలేదు. ఆ వ్యక్తిపై పాము దాడి చేయకుండా ఉండిపోయింది. ఆ పాములను అతను పెంచుకుంటున్నాడు.   స్నేహపూర్వకంగానే ఉన్నారని తెలుస్తోంది. నిజంగా ఈ వీడియోలోని పాములను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి.