Viral Video: నీ గట్స్‌కో దండంరా బాబు..కరిచిన పామును దొర్కవట్టుకుని… ఆ వ్యక్తి చేసిన పనికి డాక్టర్లే షాక్‌

పాము కరిస్తే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? వెనకా ముందు చూడకుండా దగ్గరలోని వైద్యుని వద్దకు పరిగెడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి చేసిన పనికి డాక్టర్లే షాక్‌ అయ్యారు. కరిచిన పామును దొర్కవట్టుకుని ఏకంగా డాక్టర్ల ముందు హాజరు పరిచాడు. పాము కరిచిందని కంగారు...

Viral Video: నీ గట్స్‌కో దండంరా బాబు..కరిచిన పామును దొర్కవట్టుకుని... ఆ వ్యక్తి చేసిన పనికి డాక్టర్లే షాక్‌
Snake Bite Man

Updated on: Nov 20, 2025 | 4:59 PM

పాము కరిస్తే సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? వెనకా ముందు చూడకుండా దగ్గరలోని వైద్యుని వద్దకు పరిగెడతారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ వ్యక్తి చేసిన పనికి డాక్టర్లే షాక్‌ అయ్యారు. కరిచిన పామును దొర్కవట్టుకుని ఏకంగా డాక్టర్ల ముందు హాజరు పరిచాడు. పాము కరిచిందని కంగారు పడకుండా ఆ యువకుడు భయంకరమైన పామును పట్టుకుని ఆసుపత్రికి పరిగెత్తాడు. అతను ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి పామును చూపించి వైద్య సహాయం కోరాడు. ఈ సంచలన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిందిది.

పాము కాటుకు గురైన యువకుడి పేరు గౌరవ్ కుమార్‌గా తెలుస్తోంది. బిజ్నోర్ నివాసి అయిన 30 ఏళ్ల గౌరవ్ ఇంటి దగ్గర పని చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా సమీపంలోని పొద నుండి ఒక పాము బయటకు వచ్చి అతని చేతిని కరిచింది. అంతను భయపడకుండా వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. పామును చేతిలో గట్టిగా పట్టుకుని, దాదాపు కిలోమీటరు నడిచి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు.

ఆసుపత్రికి చేరుకున్న తర్వాత, వైద్యులు పామును సురక్షితంగా ఒక బాక్స్‌లో బంధించారు. యువకుడికి అవసరమైన ట్రీట్‌మెంట్‌ అందించారు. గౌరవ్ చేసిన పనికి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

వీడియో చూండి:

వైరల్ వీడియో జర్నలిస్ట్ ప్రియా సింగ్ యొక్క X హ్యాండిల్ నుండి పోస్ట్ చేయబడింది. చాలా మంది ఇప్పటికే ఆ వీడియోను చూశారు. లైక్‌లు, కామెంట్స్‌ వెల్లువెత్తాయి. చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ యువకుడి ధైర్యం, తెలివితేటలను ప్రశంసిస్తున్నారు.