Funny Video: మీరెప్పుడైనా పుష్పక విమానాన్ని చూశారా.. ఈ సైకిల్ చూస్తే అలాగే అనిపిస్తుంది..

|

Nov 20, 2022 | 6:27 PM

పురణాల్లో పుష్పక విమానం గురించి చెబుతూ.. ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉండేదని చెబుతుంటారు. శ్రీరాముడు దీనిని ఉపయోగించారని పురణాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏ వాహనం చూసినా లిమిటెడ్ సీట్స్ ఫిక్స్ అయి..

Funny Video: మీరెప్పుడైనా పుష్పక విమానాన్ని చూశారా.. ఈ సైకిల్ చూస్తే అలాగే అనిపిస్తుంది..
Kids
Follow us on

పురణాల్లో పుష్పక విమానం గురించి చెబుతూ.. ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటు ఉండేదని చెబుతుంటారు. శ్రీరాముడు దీనిని ఉపయోగించారని పురణాల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏ వాహనం చూసినా లిమిటెడ్ సీట్స్ ఫిక్స్ అయి ఉంటాయి. సైకిల్ అయితే నడిపే వ్యక్తి కాకుండా గరిష్టంగా మరొ ఇద్దరు, ద్విచక్రవాహనం అయితే నడిపే వ్యక్తితో పాటు మరొకరు.. కారు అయితే దాని సీటింగ్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. కాని తాజాగా నెట్టింట్లో వైరల్‌గా మారిన ఓ వీడియోలో ఏకంగా తొమ్మిది మంది పిల్లలను ఎక్కించుకుని ఓ వ్యక్తి సైకిల్ పై సవారీ చేశాడు. సైకిల్ నడిపై వ్యక్తితో కలిపి పది మంది సైకిలెక్కారు. 9మంది పిల్లలను ఎక్కించుకుని.. సైకిల్ తొక్కుతూ ముందుకెళ్తున్నాడు. దీనిపై నెటిజన్లు డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. ట్విట్టర్​లో పోస్టు చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి సైకిల్​ తొక్కుతూ కనిపించాడు. సైకిల్​ వెనుక ఇద్దరు కూర్చుని ఉన్నారు. వారిలో ఒకరి మీద.. మరో చిన్నారి నిలబడి ఉంది. కింద పడిపోకుండా.. ఆ చిన్నారి అతని భుజాలను పట్టుకుంది. ఇక సైకిల్​ ముందు భాగంలోని రాడ్​ మీద మరో ఇద్దరు పిల్లలు కూర్చుని కనిపించారు. ఫ్రంట్​ వీల్​ మీద మరో చిన్నారి కూర్చుంది. మిగిలిన ఇద్దరు.. ఆ వ్యక్తి భుజాల మీద ఎక్కి కూర్చున్నారు. మొత్తం 10మంది ఆ సైకిల్​ మీద ఉన్నారు. ఇది చాలా సింపుల్​అన్నట్టుగా.. ఆ వ్యక్తి సైకిల్​ నడపడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో ఎక్కడిది అన్నది స్పష్టంగా తెలియనప్పటికి.. ఆఫ్రికా ప్రాంతంలో తీసినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోను ఇప్పటికి 2లక్షల మందికి పైగా వీక్షించగా, 7500కు పైగా లైక్స్​ వచ్చాయి.సైకిల్ పై 9మంది పిల్లలను ఎక్కించుకున్న వీడియో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది తప్పుబడుతుంటే మరికొంతమంది మాత్రం ఆ వ్యక్తికి మద్దతుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రతి విషయాన్ని తప్పుగా ఆలోచించకూడదు. ఆ పిల్లలు అందరూ అతని సంతానం కాకపోవచ్చని కొందరు కామెంట్స్ చేస్తుంటే ద ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చుండొచ్చని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఫన్నీగా సైకిల్, టైర్లు ఏ కంపెనీవో.. చాలా ధృడంగా ఉన్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..