ట్రాఫిక్‌ జామ్‌తో చిర్రెత్తిపోయిన యువకుడు.. రద్దీగా ఉన్న రోడ్డుపై బాహుబలి స్టంట్స్‌ చేస్తూ హల్‌చల్‌

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా గురుగ్రామ్‌లో వరదల కారణంగా అనేక కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినట్లు చూపించే చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడి నుండి వచ్చిన ఒక వీడియో ఇక్కడ వైరల్ అవుతోంది. దీనిలో ఇద్దరు వ్యక్తులు ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోవడానికి బాహుబలి స్టంట్‌ చేశారు.

ట్రాఫిక్‌ జామ్‌తో చిర్రెత్తిపోయిన యువకుడు.. రద్దీగా ఉన్న రోడ్డుపై బాహుబలి స్టంట్స్‌ చేస్తూ హల్‌చల్‌
Man Lifts Scooter

Updated on: Sep 05, 2025 | 9:15 AM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా గురుగ్రామ్‌లో వరదల కారణంగా అనేక కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినట్లు చూపించే చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్కడి నుండి వచ్చిన ఒక వీడియో ఇక్కడ వైరల్ అవుతోంది. దీనిలో ఇద్దరు వ్యక్తులు ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకోవడానికి బాహుబలి స్టంట్‌ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్, X లలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కార్లు, మోటార్ సైకిళ్లతో నిండిన రోడ్డును దాటడానికి, ట్రాఫిక్ జామ్‌ను తప్పించుకోవడానికి తమ స్కూటర్‌ను భుజాలపై మోసుకెళ్తున్నట్లు వెళ్తున్నారు. కాగా, వీడియో మాత్రం నెట్టింట వేగంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

ఈ 13 సెకన్ల క్లిప్‌ను ఆర్యన్ష్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. గుర్గావ్ లోకల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా దాన్ని రీపోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్‌గా గుర్గావ్ ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి ఏకైక మార్గం అని రాశారు. కాగా, ఈ వీడియోకు 91 వేలకు పైగా లైక్‌లు, అనేక భిన్నమైన కామెంట్లు కూడా వచ్చాయి. ఆ వ్యక్తిని కామెంట్ సెక్షన్‌లో ప్రజలు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..