సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా సింహం, పులి, చిరుత వేటకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తుంటాయి. అలాగే కుక్క, పిల్లి, కోతి చేసే చిలిపి చేష్టలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల వీడియోలు నెట్టింట్లో కోకొల్లలు. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ వీడియోను ఇప్పుడు చూద్దాం. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యానికి గురవుతారు.
పులిని దూరం నుంచి చూసుకో తప్పులేదు.. కావాలంటే పులితో ఓ సెల్ఫీ తీసుకో ఫర్వాలేదు.. కానీ, పులితో గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం.. అది ప్రాణాలతో చెలగాటమే అవుతుంది. ఇదో ఏదో సినిమాలో డైలాగ్ కదా అని అనుకుంటున్నారా.! ఇదంతా ఎందుకు ఇప్పుడు చెబుతున్నానంటే.. ఇక్కడొక వ్యక్తి ఏకంగా రెండు పెద్ద పులులతో ఆటలాడుకున్నాడు. అదేదో కుక్కపిల్ల, మేకపిల్ల సైజు ఉన్నాయనుకుంటే పొరపాటే.! ఆ మనిషి కంటే రెండు, మూడింతలు భారీ సైజున్న క్రూర పులులకు అతడు పాలు తాగిస్తున్నాడు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
ఇదిగో ఇక్కడ రెండు చేతుల్లో రెండు పాల సీసాలు పట్టుకుని నిల్చున్న వ్యక్తిని చూస్తున్నారుగా, ఆ రెండు పాల సీసాలు రెండు పెద్ద పులల కోసం సిద్ధం చేసినవి. చూస్తున్నారుగా.. అతడు పిలవగానే…ఆ రెండు పెద్ద పులులు ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాయో.. పైగా అతడు ఆ పాల సీసాలు పులుల నోటికి అందించకుండా కాస్త బెట్టు చేశాడు. సీసాలు పైకిలేపి వాటిని ఆటపట్టించాలని చూశాడు. అవి కూడా అతనితో అంతే గారాబం పోతూ.. అతని రెండు భుజాలపైకి రెండు కాళ్లు వేసి నిలబడి సీసాతో పాలు తాగేస్తున్నాయి. బాబోయ్ ఈ సీన్ చూస్తే నిజంగానే గుండె ఆగిపోయినంత పనవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.
But animal always never change their habit,it is in there blood.danger to him.
— BALASUBRAMANIAN J (@BALASUB84347053) August 13, 2021
Why do they always give these grown big cats milk in bottle?
— Nagato (@Shinra_Tensei_1) August 13, 2021
This man is playing with death
— AirBall (@dallaz05) August 13, 2021
Okay, it’s the first time we get a real perspective of how big those cats are compared to an average human being!!!
— AMOGH KUMAR (@TheAmoghKumar) August 14, 2021