
వరుసగా ఐదారు రోజులు సెలవులు దొరికితే మనం సొంతూళ్లకు ఎలా ప్రయాణం అవుతామో.. విదేశాల్లో కూడా లాంగ్ లీవ్స్ దొరికినప్పుడు ఏదైనా నేచర్‌ను ఆస్వాదించేందుకు అలా హైకింగ్‌కి, ఫిషింగ్‌కి వెళ్తుంటారు. సరిగ్గా ఇలానే ఇద్దరు వ్యక్తులు హైకింగ్‌కి అమెరికాలోని గెట్టిస్‌బర్గ్‌లోని డెవిల్స్ డెన్‌కు వెళ్లారు. ఇక వారు అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేసి.. ఎంచక్కా తమ తీపిగుర్తులను ఫోటోలుగా తీసుకుని ఇంటికొచ్చారు. ఇక ఓసారి ఆల్బమ్ తిరగేస్తే.. దెబ్బకు ఓ ఫోటో చూసి షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. గెట్టిస్‌బర్గ్‌లోని డెవిల్స్ డెన్‌కు విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. అసాధారణమైన చరిత్ర, అలాగే భయంకరమైన నిశ్శబ్దానికి కేరాఫ్‌గా నిలిచే.. ఈ డెవిల్స్ డెన్‌లో మర్మమైన ఎన్నో విషయాలు చోటు చేసుకుంటాయని స్థానికంగా చెబుతుంటారు. ఇక డెవిల్స్ డెన్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఆ ఇద్దరు వ్యక్తులు.. తమ తీపిగుర్తులను మర్చిపోకుండా ఉండేందుకు ఓ ఫోటో దిగారు. ఆ సమయంలో అక్కడ వారిద్దరూ తప్ప మరెవ్వరూ లేరు. అయితే ఇంటికెళ్లి ఓసారి దిగిన ఫోటోలను తిరగేసినప్పుడు.. వారి పక్కనే ఏదో వింతగా కనిపించింది. ఆ ఫోటోలో ఓ మర్మమైన వ్యక్తిని మీరు స్పష్టంగా చూడవచ్చు. పాత యాత్రికుల దుస్తులను ధరించి కనిపిస్తాడు. ఇక్కడ ఇంకా భయంకరమైన విషయమేమిటంటే.. అతడు వెనక్కి తిరిగి.. వెనక్కి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ప్రస్తుతానికి అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అది పురాతన కాలంలో చిక్కుకుని.. తప్పిపోయిన ఆత్మ కావచ్చునని, దెయ్యం అయ్యి ఉండొచ్చునని.. ఇలా ఎవరికి తోచింది వారు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.