పెళ్లి విందులో స్పెషల్ మ్యాగీ.. చికెన్, మటన్‌ బలాదూర్..! క్యూ కట్టిన అతిథులు.. ఆ సీన్‌ చూడాల్సిందే..!!

పెళ్లి పేరుతో విలాసవంతమైన బఫేలు, లైవ్ కౌంటర్లు, వివిధ రకాల వంటకాలు సర్వసాధారణం. అయితే, ఇటీవల జరిగిన ఒక వివాహంలో ఒక సాధారణ మ్యాగీ స్టాల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం అక్కడ గుమిగూడిన భారీ జనసమూహం. ఆదిత్య వర్మ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో దానిపై చర్చ మొదలైంది.. వివాహ వేదిక వద్ద మ్యాగీ కౌంటర్ చుట్టూ అతిథులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టి ఉండటం వీడియోలో కనిపిస్తుంది.

పెళ్లి విందులో స్పెషల్ మ్యాగీ.. చికెన్, మటన్‌ బలాదూర్..! క్యూ కట్టిన అతిథులు.. ఆ సీన్‌ చూడాల్సిందే..!!
Maggi Stalls At Weddings

Updated on: Feb 24, 2026 | 4:53 PM

ప్రస్తుత రోజుల్లో పెళ్లి అనేది వారికి ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. ముఖ్యంగా భారతీయ వివాహాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు్న్నారు. పెళ్లి పేరుతో విలాసవంతమైన బఫేలు, లైవ్ కౌంటర్లు, వివిధ రకాల వంటకాలు సర్వసాధారణం. అయితే, ఇటీవల జరిగిన ఒక వివాహంలో ఒక సాధారణ మ్యాగీ స్టాల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం అక్కడ గుమిగూడిన భారీ జనసమూహం. ఆదిత్య వర్మ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయడంతో దానిపై చర్చ మొదలైంది.. వివాహ వేదిక వద్ద మ్యాగీ కౌంటర్ చుట్టూ అతిథులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టి ఉండటం వీడియోలో కనిపిస్తుంది.

పెళ్లిలో రకరకాల వంటకాలు ఉన్నప్పటికీ, మ్యాగీ స్టాల్ అత్యంత రద్దీగా ఉందని వీడియో స్పష్టంగా చూపిస్తుంది. కొడుకు, కూతురు పెళ్లి చేయాలని ప్లాన్‌ చేస్తున్న ప్రతి ఒక్కరూ లేదంటే, వెడ్డింగ్‌ ఏర్పాట్లు చేస్తున్న నిర్వహకులు, ఎందరో క్యాటరర్లు దీని నుండి నేర్చుకోవాలని ఆదిత్య వర్మ వీడియోలో సరదాగా అన్నారు. అతిథులు దీన్ని చాలా ఇష్టపడుతున్నందున, ప్రతి భారతీయ వివాహంలో మ్యాగీని చేర్చాలని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆ వీడియో త్వరగా వైరల్ అయింది. కామెంట్ విభాగం ఆసక్తికరమైన కామెంట్స్‌తో నిండిపోయింది. ఒక వినియోగదారుడు.. మ్యాగీ నా ఫస్ట్‌ లవ్‌ అంటూ రాశాడు. మరొకరు, దీన్ని తప్పనిసరిగా ట్రై చేయండి అని అన్నారు. ఇంకొకరు ఇది నా పెళ్లిలో ఇప్పటికే ఏర్పాటు చేశాం అని కూడా పంచుకున్నారు. అంతేకాదు.. ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్ మ్యాగీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ సైతం దీనిపై స్పందించింది. దీంతో ఈ పోస్ట్‌ మరింత ఆసక్తికరంగా మారింది. నెటిజన్ల కామెంట్స్‌తో కంపెనీ ఏకీభవించింది.. ఇది చర్చకు మరింత ఆజ్యం పోసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us