
మనం అప్పుడప్పుడూ చేసే కొన్ని అనుకోని తప్పులే.. మనల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇక ఆ చేసిన మిస్టేక్ తెలుసుకుని సరిదిద్దుకునేలోపే జరగాల్సిందంతా జరిగిపోతుంది. సరిగ్గా ఇదే కోవకు చెందిన ఓ షాకింగ్ అనుభవం ఒక యువకుడికి ఎదురైంది. ఆన్‌లైన్‌లో కండోమ్స్ ఆర్డర్ ఇచ్చిన అతడు.. చిన్న పొరపాటు చేయడం వల్ల ఇంట్లోవాళ్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఇక ఆ యువకుడు చేసిన తప్పును.. అతడి సోదరి ఆన్‌లైన్ వేదికగా నెటిజన్లతో పంచుకుంది. దీంతో ఈ వ్యవహారంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు ఆన్‌లైన్ వేదిక ఇన్‌స్టామార్ట్‌లో కండోమ్స్ ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఆర్డర్‌కు సంబంధించిన అడ్రస్ మార్చడం మర్చిపోయాడు. తన అడ్రస్‌కు పంపాల్సింది బదులుగా తన సొంతింటి అడ్రస్‌కు పంపించాడు. దీంతో ఆ ఆర్డర్ కాస్తా అతడి తల్లిదండ్రులు ఉన్న ఇంటి అడ్రస్‌కు వెళ్లింది. ఆ యువకుడు తల్లి.. తన కొడుకు ఏం పంపించాడా.? అని ఆతృతగా తెరిచి చూడగా.? అందులో కండోమ్స్ దర్శనమిచ్చాయి. దీంతో షాక్ కావడం వారి వంతైంది. ఇక ఈ విషయాన్ని ఆ యువకుడి సోదరి ఇంటర్నెట్‌లో పంచుకోవడంతో.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
Looks like my brother forgot to change the address because my mom just received his instamart order💀💀 pic.twitter.com/BmZbLyEAtr
— elena (@elena4yo) July 4, 2023