23 ఏళ్ల కుర్రాడు.. 91 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు కోర్టుకు వెళ్లాడు..అసలు ట్విస్ట్‌ ఏంటంటే..!

|

Nov 03, 2023 | 5:25 PM

ఇలాంటివి ఎక్కువగా ప్రేమ పెళ్లిల విషయంలోనే జరుగుతుంటాయి. వారిది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమలో భాగస్వామి వయస్సు ముఖ్యం కాదని అంటారు. అయితే ఇలాంటి జంట గురించి మీరు ఎప్పుడూ వినుండరు..10- 20 ఏళ్లు కాదు.. ఏకంగా 68 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌తో జరిగిన ఒక పెళ్లి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అందులో 91 ఏళ్ల మహిళ తన కంటే 68 ఏళ్లు చిన్నవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుని హనీమూన్‌కి కూడా వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

23 ఏళ్ల కుర్రాడు.. 91 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు కోర్టుకు వెళ్లాడు..అసలు ట్విస్ట్‌ ఏంటంటే..!
man 23 claims married to 91 year old great aunt
Follow us on

ఎవరైనా పెళ్లి చేసుకుంటే, వయస్సు తేడా చాలా ముఖ్యం. కొందరిలో ఏజ్ గ్యాప్ అస్సలు ఉండదు, కొందరిలో 10 ఏళ్ల వయసు గ్యాప్ ఉంటుంది. సాధారణంగా మగవాళ్లు తమ కంటే రెండు నుంచి మూడేళ్లు లేదా గరిష్టంగా ఓ 5 ఏళ్లు తక్కువ వయస్సు ఉన్న మహిళను తమ జీవిత భాగస్వామిగా చేసుకుంటారు. అప్పుడప్పుడు కొందరు తమ కంటే వయసులో రెండు మూడు సంవత్సరాలు పెద్దైన ఆడవాళ్లను పెళ్లి చేసుకున్న జంటల గురించి ఎన్నో వార్తలు విన్నాం. ఇలాంటివి ఎక్కువగా ప్రేమ పెళ్లిల విషయంలోనే జరుగుతుంటాయి. వారిది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమలో భాగస్వామి వయస్సు ముఖ్యం కాదని అంటారు. అయితే ఇలాంటి జంట గురించి మీరు ఎప్పుడూ వినుండరు..10- 20 ఏళ్లు కాదు.. ఏకంగా 68 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌తో జరిగిన ఒక పెళ్లి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అందులో 91 ఏళ్ల మహిళ తన కంటే 68 ఏళ్లు చిన్నవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుని హనీమూన్‌కి కూడా వెళ్లింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వృత్తిరీత్యా న్యాయవాది అయిన అర్జెంటీనాలోని సాల్టాకు చెందిన మారిసియో అనే 23 ఏళ్ల వ్యక్తి అప్పటికే మరణించిన తన 91 ఏళ్ల అమ్మమ్మ యోలాండా టోరెస్ పెన్షన్ కోసం న్యాయ పోరాటం ప్రారంభించాడు. మారిసియో చెప్పిన ప్రకారం అతని 91 ఏళ్ల బామ్మ యోలాండా టోరెస్ భర్త అతను.. అందుకే తాను ఆమె పెన్షన్‌కు అర్హుడనని వాదించాడు. 2015 లో తాను అతనికంటే చాలా పెద్దదైన అమ్మమ్మ అయిన యోలాండాను వివాహం చేసుకున్నానని చెప్పాడు. తన భార్య అయిన యోలాండా టోరెస్ 2016 ఏప్రిల్‌లో మరణించింది. అటువంటి పరిస్థితిలో ఆమె పెన్షన్‌కు తాను అర్హుడనని మారిసియో కోర్టుకు చెప్పాడు..కోర్టులో వాదోపవాదనలు, పొరుగువారు వారి సమాచారం మేరకు ఈ వివాహం ఫేక్‌ అని తేల్చింది కోర్టు. దాంతో మారిసియో వేసిన కేసును కోర్టు కొట్టిపారేసింది.

వాయువ్య అర్జెంటీనా నగరమైన సాల్టాకు చెందిన మారిసియో తల్లిదండ్రులు 2009లో విడిపోయారు. దాంతో మారిసియో తన తల్లి, సోదరి, అమ్మమ్మ, ముత్తాతలతో నివసించేవాడు. 2016లో యోలాండా మరణించిన తర్వాత, అతడు తన అమ్మమ్మ పెన్షన్ కోసం ప్రభుత్వ ఖాతాలో తన పేరును నమోదు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాను తన 91ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. అయితే, మారిసియో ప్రకటనపై అర్జెంటీనా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. వీరి పెళ్లికి హాజరైన అధికారులు, పాల్గొన్న వ్యక్తులు, తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగువారిని విచారించగా, మారిసియో పెళ్లి గురించి తమకేమీ తెలియదని ఇరుగుపొరుగు వారితో పాటు అందరూ చెప్పారు. దాంతో మారిసియో వేసిన దావా తిరస్కరించింది కోర్టు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని రుజువు చేసి పింఛను కచ్చితంగా పొందాలని దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళతానంటున్నాడు మారిసియో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..