Viral News: గర్భవతిని చేయడమే ఉద్యోగం, రూ. 13 లక్షల జీతం.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే..

|

Jan 03, 2024 | 10:18 AM

బిహార్‌లోని నవాడా జిల్లాలో 'ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ ఏజెన్సీ' పేరుతో ఓ ఉద్యోగ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. గర్భందాల్చని స్త్రీలను గర్భవతులను చేయడమే ఉద్యోగం అంటూ ప్రచారం చేశారు. ఎవరైతే స్త్రీని గర్భవతి చేస్తారో వారికి రూ. 13 లక్షలను అందిస్తామని నమ్మించారు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రయత్నించి...

Viral News: గర్భవతిని చేయడమే ఉద్యోగం, రూ. 13 లక్షల జీతం.. అసలు ట్విస్ట్‌ ఏంటంటే..
Representative Image
Follow us on

సమాజంలో నేరాల శైలి రోజురోజుకీ మారిపోతోంది. మనుషుల బలహీనతలు, అత్యాశను ఆసరగా చేసుకొని కొందరు నేరస్థులు రెచ్చిపోతున్నారు. చేతికి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ ఉదంతం గురించి వింటే.. నేరాలు ఇలా కూడా జరుగుతుయా అన్న ప్రశ్నరాక మానదు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బిహార్‌లోని నవాడా జిల్లాలో ‘ఆల్‌ ఇండియా ప్రెగ్నెంట్‌ జాబ్‌ ఏజెన్సీ’ పేరుతో ఓ ఉద్యోగ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. గర్భందాల్చని స్త్రీలను గర్భవతులను చేయడమే ఉద్యోగం అంటూ ప్రచారం చేశారు. ఎవరైతే స్త్రీని గర్భవతి చేస్తారో వారికి రూ. 13 లక్షలను అందిస్తామని నమ్మించారు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రయత్నించి, గర్భం దాల్చకపోయినా ప్రోత్సాహకంగా రూ. 5 లక్షలు ఇస్తారని ప్రచారం చేసుకున్నారు.

దీంతో కొందరు ఇది నిజమేనని కొందరు వెనకా ముందు ఆలోచించకుండా ముందుకొచ్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్‌ దాగి ఉంది. నిజానికి ఇదొక ఫేక్‌ ఏజెన్సీ.. లాభదాయకమైన ఆఫర్‌ ముసుగులో ముందుగా ఇందుకు ఆసక్తి చూపించిన వారి నుంచి రూ. 799 రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేశారు. అనంతరం వాట్సాప్‌లో మహిళల ఫొటోలు పంపించి, వీరినే గర్భవతులుగా చేయాలని తెలిపారు. ఇక అనంతరం సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ. 20,000 వరకు చెల్లించాలని తెలిపారు.

అంతటితో ఆగకుండా.. మహిళల అందాన్ని బట్టి ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇంకేముంది కొందరు వెనకా ముందు ఆలోచించకుండా వేలకు వేలు కట్టేశారు. తీరా చివరికి ఇదొక ఫేక్‌ ఏజెన్సీ అని తెలసి తాము మోసపోయామని తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలసులు రంగంలోకి దిగగా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ మొత్తం స్కామ్‌ వెనకాల మున్నా కుమార్‌ అనే సూత్రధారి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మున్నా పరారీలో ఉన్నాడు. ఇక ఈ స్కామ్ లో భాగమైన 8 మందిని ఇప్పటి వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ముమ్మాటికీ అనైతికం, చట్ట విరుద్ధమని చెబుతోన్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..