Monalisa Bhosle: తేనే కళ్ల సుందరి మోనాలిసా డ్యాన్స్‌ చూశారా..? కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో కత్తిలాంటి..

మహాకుంభ్ 2025లో తన సింప్లిసిటీ, అందంతో వైరల్ అయిన మోనాలిసా ఇప్పుడు వేరే అవతార్‌లో కనిపించింది. మోనాలిసా AI ద్వారా తన గ్లామరస్ స్టైల్‌ను ఎరుపు రంగు మోడ్రన్ డ్రెస్‌లో ధరించి, నది ఒడ్డున “షరారా షరారా” పాటపై డ్యాన్స్‌ చేసింది. ఆమె కిల్లర్ లుక్స్, పర్ఫెక్ట్ మూవ్స్ చూస్తుంటే ఆమె బాలీవుడ్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పక తప్పు అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.

Monalisa Bhosle: తేనే కళ్ల సుందరి మోనాలిసా డ్యాన్స్‌ చూశారా..? కలర్‌ ఫుల్‌ డ్రెస్‌లో కత్తిలాంటి..
Monalisa Ai Dance

Updated on: Feb 02, 2025 | 7:45 PM

మహా కుంభమేళలో పాల్గొన్న చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. వారిలో ఒక పేరు మరింత ఎక్కువ మందిని ఆకర్షించింది. ఆ పేరు మోనాలిసా. అవును ఈ తేనె కళ్ల అమ్మాయి వార్తలు ఇంటర్‌ నిండా కనిపించాయి. మోనాలిసా తన కుటుంబంతో కలిసి మహాకుంభ్‌ మేళాలో పూసలు దండలు విక్రయించడానికి మధ్యప్రదేశ్ నుండి వచ్చింది. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు మోనాలిసాను గమనించి వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత మోనాలిసా వైరల్‌గా మారింది. ఇప్పుడు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది. సినిమాలో నటించే ముందు మోనాలిసా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేయబడింది. అందులో అచ్చం మోనాలిసా లాగే కనిపించే ఒక అమ్మాయి సినిమా పాటలో డ్యాన్స్ చేస్తోంది. వీడియోలో అమ్మాయి ఫ్యాషన్‌ దుస్తులు ధరించి కనిపించింది. @ni8.out9 ఖాతాలో ఇలాంటి అనేక వీడియోలు షేర్ చేయబడ్డాయి. ఆ వీడియోకు లక్షల్లో వీక్షణలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్‌గా మారిన వీడియో క్యాప్షన్‌గా మహాకుంభ్‌ మేళలో కనిపించిన వైరల్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా గ్లామరస్ డ్యాన్స్ లాగా ఉందని రాశారు. మహాకుంభ్ 2025లో తన సింప్లిసిటీ, అందంతో వైరల్ అయిన మోనాలిసా ఇప్పుడు వేరే అవతార్‌లో కనిపించింది. మోనాలిసా AI ద్వారా తన గ్లామరస్ స్టైల్‌ను ఎరుపు రంగు మోడ్రన్ డ్రెస్‌లో ధరించి, నది ఒడ్డున “షరారా షరారా” పాటపై డ్యాన్స్‌ చేసింది. ఆమె కిల్లర్ లుక్స్, పర్ఫెక్ట్ మూవ్స్ చూస్తుంటే ఆమె బాలీవుడ్‌ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పక తప్పు అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..