
మకర సంక్రాంతి పండుగ రాగానే దేశవ్యాప్తంగా గాలిపటాలు ఎగురవేయడం ప్రారంభమవుతుంది. అయితే, ఈసారి మకర సంక్రాంతి విషయంలో గందరగోళం నెలకొంది. కొంతమంది జనవరి 14న మకర సంక్రాంతి వస్తుందని చెబుతుండగా, మరికొందరు జనవరి 15న పండుగ జరుపుకోవడం శుభప్రదమని నమ్ముతున్నారు. పండుగ ఎప్పుడు జరుపుకున్నా, ప్రజలు ఇప్పటికే గాలిపటాలు ఎగురవేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం లాగే, చైనీస్ మాంజా ప్రజలకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం, ఒక మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారి చైనీస్ మాంజా నుంచి ఎలా రక్షించుకోవాలో వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన వాహనదారులను ఉద్ధేశించి, ఒక మహిళా పోలీసు అధికారి చైనీస్ మాంజా నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో వారికి బోధించారు. హెల్మెట్ ధరించడం ఎంత అవసరమో, అలాగే చైనీస్ మాంజా నుండి రక్షించుకోవడానికి మెడలో స్కార్ఫ్ ధరించడం అంతే ముఖ్యమని, ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైనవని, వాటిని తాకిన వెంటనే మెడను కోసుకుంటాయని ఆమె వివరించారు. అవి ప్రాణాంతకం కూడా కావచ్చు, కాబట్టి సురక్షితంగా ఉండటం చాలా కీలకం. మహిళా పోలీసు అధికారి తీసుకున్న ఈ చొరవ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @Nargis_Bano78 అనే IDతో షేర్ చేయడం జరిగింది. దీనికి “భారతదేశం మొత్తాన్ని గర్వపడేలా మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారుల చొరవ. ఇండోర్‌లోని గీతా భవన్ కూడలిలో, మహిళా ట్రాఫిక్ పోలీసు అధికారులు చైనీస్ దారాన్ని నివారించే మార్గాలను వివరించారు. చైనీస్ మాంజా నుండి హానిని నివారించడానికి రెడ్ లైట్ సమయంలో వాహనదారు మెడలో రుమాలు లేదా కండువా కట్టుకోవాలని పదేపదే పోలీసులు సూచించారు.” అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఈ 48 సెకన్ల వీడియోను 18,000 సార్లు వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ రకాల అభిప్రాయాలను అందించారు. ఒక వినియోగదారుడు “ఇది వివరించడానికి, సహాయం చేయడానికి ఒక అద్భుతమైన మార్గం” అని రాశారు. మరొకరు “సోదరి, మీకు హృదయపూర్వక వందనం చేస్తున్నాను. ఇది అధికారుల బాధ్యత” అని రాశారు.
వీడియోను ఇక్కడ చూడండిః
महिला ट्रैफिक पुलिस की ऐसी पहल जिसे देखकर पूरा भारत उन पर गर्व महसूस करेगा ,
इंदौर के गीता भवन चौराहे पर महिला ट्रैफिक पुलिस ने चाइनीज मांझे से बचने के उपाय बताये ,
Singing cops ने लाल बत्ती के दौरान वाहन चलाने वालो को समझाया की गले मे आप रुमाल या स्कार्फ बांधे ताकि चाइनीज… pic.twitter.com/3SnpeqsyLS
— Nargis Bano (@Nargis_Bano78) January 13, 2026